కేవలం రూ.9,990 ధరకే సరికొత్త 32 ఇంచ్ Android స్మార్ట్ టీవీ లాంచ్

కేవలం రూ.9,990 ధరకే సరికొత్త 32 ఇంచ్ Android స్మార్ట్ టీవీ లాంచ్
HIGHLIGHTS

ఈ రెండు టీవీలు కూడా రెండు సంవత్సరాల వారంటీతో వస్తాయి

ప్రముఖ టీవీ తయారీధారు Daiwa సంస్థ, ఈరోజు ఇండియాలో రెండు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ లను ప్రకటించింది. ఈ టీవీలను బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ టీవీ లను 32 మరియు 39 అంగుళాల పరిమాణంతో మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లతో అందించింది.  ఈ టీవీల గురించి చెప్పుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ రెండు టీవీలు కూడా రెండు సంవత్సరాల వారంటీతో వస్తాయి.

Daiwa ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలను ఒక 32 ఇంచ్ మరియు మరొకదాన్ని 39 ఇంచ్ సైజులో ప్రకటించింది. ఈ టీవీని 32 ఇంచ్ టీవీని D32S7B మోడల్ నంబరుతో మరియు 39 ఇంచ్ టీవీని D40HDRS మోడల్ నంబరుతో విడుదల చేసింది. ఈ రెండు టీవీలు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫీచర్లతో వస్తాయి. ఇందలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు 1GB ర్యామ్ కి జతగా 8GB ఇంటర్నల్ స్టోరేజిని అఫర్ చేస్తోంది. ఇక ఈ రెండు టీవీలు కూడా Android 8.0 ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తాయి మరియు A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తాయి. అలాగే, ఇవి HD Ready (1366×768) రిజల్యూషన్ తో పాటుగా క్వాంటమ్ ల్యూమినిట్ HRDP టెక్నలాజితో 178 డిగ్రీల వ్యూవింగ్ యాంగిల్ ఇస్తుంది.

వీటిలో అందించిన మిగిలిన ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇవి రెండు కూడా కష్టం డిజైన్ UI- The Big Wall తో HotStar, Zee 5, Sony Live వంటి 7000 వేలకు పైగా యాప్స్ మీకు యాక్సెస్ అందిస్తుంది. ఇందులో అందించిన 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు కొత్త మూవీ మోడ్ మీకు సినిమా ధియేటర్ వంటి డిస్ప్లే అనుభవాన్నిచవి చూస్తారు. ఇక సౌండ్ పరంగా, ఇందులో 20 వాట్స్ ఇన్ బిల్ట్ బాక్స్ స్పీకర్లును అందుకుంటారు మరియు ఇతర ఆడియో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఎనేబుల్ టెక్నలాజిని కూడా అందించింది                

ఇక వీటి ధర విషయానికి వస్తే,  ఈ 32 ఇంచి టీవీని రూ.9,990 ధరతోను 39 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 16,490 ధరతోను ప్రకటించింది. ఈ టీవీలను అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లు, ఔట్లెట్లు లో అందుబాటులో ఉంచింది మరియు బజాజ్ ఫిన్ సర్వ్ నుండి చాల సులభ వాయిదాల (EMI) ఎంపిక ద్వారా కొనే అవకాశం కూడా అందించింది.                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo