10 వేల బడ్జెట్ లో రెండు కొత్త Smart Tv లు లాంచ్ చేసిన Daiwa బ్రాండ్.!

10 వేల బడ్జెట్ లో రెండు కొత్త Smart Tv లు లాంచ్ చేసిన Daiwa బ్రాండ్.!
HIGHLIGHTS

Daiwa బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది

ఈ టీవీ లను Dolby Audio మరియు బెజెల్ లెస్ డిజైన్ తో అందించింది

డైవా ఈ రెండు కొత్త Smart Tv లను 32 ఇంచ్ సైజులో విడుదల చేసింది.

ప్రముఖ Smart Tv బ్రాండ్ Daiwa ఇప్పుడు 10 వేల బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. ఈ టీవీ లను Dolby Audio మరియు బెజెల్ లెస్ డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది. ఈ టీవీ లు Flipakrt ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. సరికొత్తగా డైవా విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Daiwa New Smart Tv : ప్రైస్

డైవా ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలను 32 ఇంచ్ సైజులో విడుదల చేసింది. ఇందులో ఒకటి LED కాగా మరొకటి QLED స్మార్ట్ టీవీ. ఈ రెండు స్మార్ట్ టీవీల ధరలు ఇక్కడ చూడవచ్చు.

డైవా (32) ఇంచ్ Google HD (32G1H) స్మార్ట్ టీవీ ధర : రూ. 10,999

డైవా (32) ఇంచ్ Google QLED (32G1Q) స్మార్ట్ టీవీ ధర : రూ. 11,499

ఈ టీవీ లను Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ టీవీల పై మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ టీవీ లను BOBCARD మరియు Federal Bank కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Daiwa New Smart Tv : ఫీచర్స్

డైవా లాంచ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలలో 32G1H మోడల్ టీవీ DLED ప్యానల్ తో వస్తే, 32G1Q మోడల్ టీవీ మాత్రం QLED ప్యానల్ తో వస్తుంది. ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు కూడా బెజెల్ లెస్ డిజైన్ తో వచ్చాయి. ఈ టీవీలలో 3 HDMI, 2 USB బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi సపోర్ట్ లను కలిగి ఉంటాయి.

Daiwa New Smart Tv

ఈ రెండు స్మార్ట్ టీవీలు ARM Quad Core A55 x 4 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. వేగవంతమైన గేమింగ్ రెస్సాన్స్ కోసం ALLM ఫీచర్ కూడా ఈ టీవీలలో అందించింది. ఈ రెండు టీవీలు కూడా Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తాయి. 20W సౌండ్ అందించే రెండు స్పీకర్ లను ఈ ఈ టీవీలు కలిగి ఉన్నాయి.

Also Read: OnePlus Nord Buds 3 సూపర్ సౌండ్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

ఈ రెండు టీవీలు HDR 10 సపోర్ట్ తో జతగా వస్తాయి. ఈ రెండు టీవీల మధ్య ఉన్న పెద్ద తేడా ఈ టీవీల ప్యానల్ రకం మాత్రమే అని క్లియర్ గా అర్థం అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo