Daiwa లేటెస్ట్ గా ఇండియాలో నాలుగు కొత్త Smart LED TV లను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు కేవలం రూ.11,990 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ నాలుగు స్మార్ట్ టీవీలలో రెండు రెగ్యులర్ టీవీలు కాగా మరొక రెండు వాయిస్ ఎనేబుల్ తో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు కస్టమ్ UI తో 'TheBigwall' పేరులో పిలువబడే CloudTV OS తో పనిచేస్తాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ Daiwa స్మార్ట్ టీవీల విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
32-ఇంచ్ (D32SM9) : రూ.11,990
39-ఇంచ్ (D40HDR9L): రూ.12,490
32-ఇంచ్ (వాయిస్-ఎనేబుల్డ్)(D32SM9A): రూ.17,990
39-ఇంచ్ (వాయిస్-ఎనేబుల్డ్)(D40HDR9LA): రూ.18,490
ఈ స్మార్ట్ టీవీలు Daiwa అధికారిక వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఈ లేటెస్ట్ డైవా స్మార్ట్ టీవీలు బిగ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో క్లౌడ్ టీవీ OS (Android 9 TV ఆధారంగా) పనిచేస్తాయి.ఈ నాలుగు స్మార్ట్ టీవీలు కూడా HD Ready రిజల్యూషన్ తో ఉంటాయి.ఈ టీవీలు A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAM మరియు 8GB ROM తో అందించబడతాయి. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ టీవీలు 2 HDMI, 2 USB-A, WiFi, ఈథర్‌నెట్ మరియు ఆప్టికల్ అవుట్‌పుట్ ను కలిగి ఉన్నాయి.
ఈ టీవీలు 20W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లను మరియు సరౌండ్ సౌండ్ తో కలిగివున్నాయి. అలాగే, ఈ టీవీలలో క్వాంటం ల్యుమినెంట్ టెక్నాలజీ మరియు A+ గ్రేడ్ ప్యానల్ ను అందించింది.
ఇక ఈ టీవీలను ఆన్లైన్ స్టోర్స్ నుండి బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా ఫైనాన్సింగ్ పొందవచ్చు. అలాగే Daiwa వెబ్‌సైట్ నుండి కూడా వివిధ ఫైనాన్సింగ్ అప్షన్లతో పొందవచ్చు.