చవక ధరలో కొత్త Smart LED TV లను విడుదల చేసిన Daiwa: ప్రారంభ ధర రూ.11,990

చవక ధరలో కొత్త Smart LED TV లను విడుదల చేసిన Daiwa:  ప్రారంభ ధర రూ.11,990
HIGHLIGHTS

Daiwa లేటెస్ట్ గా ఇండియాలో నాలుగు కొత్త టీవీలను విడుదల చేసింది

కొత్త Smart LED TV లను బడ్జెట్ ధరలో విడుదల చేసింది

కేవలం రూ.11,990 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది

Daiwa లేటెస్ట్ గా ఇండియాలో నాలుగు కొత్త Smart LED TV లను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు కేవలం రూ.11,990 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ నాలుగు స్మార్ట్ టీవీలలో రెండు రెగ్యులర్ టీవీలు కాగా మరొక రెండు వాయిస్ ఎనేబుల్ తో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు కస్టమ్ UI తో 'TheBigwall' పేరులో పిలువబడే CloudTV OS తో పనిచేస్తాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ Daiwa స్మార్ట్ టీవీల విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

Daiwa స్మార్ట్ LED టీవీ: ధర

32-ఇంచ్ (D32SM9) : రూ.11,990 

39-ఇంచ్ (D40HDR9L): రూ.12,490

32-ఇంచ్ (వాయిస్-ఎనేబుల్డ్)(D32SM9A): రూ.17,990

39-ఇంచ్ (వాయిస్-ఎనేబుల్డ్)(D40HDR9LA): రూ.18,490

ఈ స్మార్ట్ టీవీలు Daiwa అధికారిక వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

Daiwa స్మార్ట్ LED టీవీ: స్పెక్స్

ఈ లేటెస్ట్ డైవా స్మార్ట్ టీవీలు బిగ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో క్లౌడ్ టీవీ OS (Android 9 TV ఆధారంగా) పనిచేస్తాయి.ఈ నాలుగు స్మార్ట్ టీవీలు కూడా HD Ready రిజల్యూషన్ తో ఉంటాయి.ఈ టీవీలు A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1GB RAM మరియు 8GB ROM తో అందించబడతాయి. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ టీవీలు 2 HDMI, 2 USB-A, WiFi, ఈథర్‌నెట్ మరియు ఆప్టికల్ అవుట్‌పుట్ ను కలిగి ఉన్నాయి.

ఈ టీవీలు 20W సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లను మరియు సరౌండ్ సౌండ్ తో కలిగివున్నాయి. అలాగే, ఈ టీవీలలో క్వాంటం ల్యుమినెంట్ టెక్నాలజీ మరియు A+ గ్రేడ్ ప్యానల్ ను అందించింది.

ఇక ఈ టీవీలను ఆన్లైన్ స్టోర్స్ నుండి బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా ఫైనాన్సింగ్ పొందవచ్చు. అలాగే Daiwa వెబ్‌సైట్‌ నుండి కూడా వివిధ ఫైనాన్సింగ్ అప్షన్లతో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo