digit zero1 awards

చవక ధరలో LG ThinQ సపోర్ట్ తో కొత్త QLED Smart Tv లాంచ్ చేసిన డైవా.!

చవక ధరలో LG ThinQ సపోర్ట్ తో కొత్త QLED Smart Tv లాంచ్ చేసిన డైవా.!
HIGHLIGHTS

Daiwa కొత్త QLED Smart Tv లను విడుదల చేసింది

బడ్జెట్ ధరలో ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను అందించింది

ఈ స్మార్ట్ టీవీ లను LG ThinQ సపోర్ట్ తో అందించి మరింత ఆకట్టుకుంది

భారతీయ టీవీ తయారీ కంపెనీ Daiwa కొత్త QLED Smart Tv లను విడుదల చేసింది. భారతీయ యూజర్లకు అనువైన ఫీచర్లు మరియు బడ్జెట్ ధరలో ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను అందించింది. ఈ స్మార్ట్ టీవీ లను LG ThinQ సపోర్ట్ తో అందించి మరింత ఆకట్టుకుంది. సరికొత్తగా మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ టీవీల పై ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డే సేల్ నుండి గొప్ప డీల్స్ అందించడంతో మరింత చవక ధరకే లభిస్తున్నాయి.

Daiwa QLED Smart Tv

డైవా ఇండియాలో మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ కొత్త టీవీ లను 43 ఇంచ్, 50 ఇంచ్ మరియు 65 ఇంచ్ సైజుల్లో అందించింది. ఈ టీవీ లను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకు వచ్చింది మరియు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ టీవీ ధరలు ఇలా ఉన్నాయి.

డైవా క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43 ఇంచ్) ధర : రూ. 22,499

డైవా క్యూలెడ్ స్మార్ట్ టీవీ (50 ఇంచ్) ధర : రూ. 29,499

డైవా క్యూలెడ్ స్మార్ట్ టీవీ (65 ఇంచ్) ధర : రూ. 52,299

ఈ స్మార్ట్ టీవీ లను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి BOBCARD EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 2,000 డిస్కౌంట్ మరియు HDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, 65 ఇంచ్ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Netflix: యాడ్స్ తో సరసమైన ప్లాన్లను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్..!

Daiwa QLED Smart Tv: ఫీచర్లు

ఈ డైవా క్యూలెడ్ టీవీలు 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన QLED డిస్ప్లేతో వచ్చాయి. ఈ టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటాయి. ఈ టీవీ MEMC, ALLM, HDR10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది.

LG ThinQ QLED Smart Tv
LG ThinQ QLED Smart Tv

ఈ డైవా లేటెస్ట్ స్మార్ట్ టీవీలు 3 HDMI, 2USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ LG Web OS పైన పని చేస్తుంది మరియు ThinQ App తో కూడా వర్క్ చేస్తుంది.

ఈ టీవీలు 24W సౌండ్ అందించగల రెండు స్పీకర్లను కలిగి ఉంటాయి. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు 5 సౌండ్ మోడ్ .లను కలిగి ఉంటుంది. ఇందులో, మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo