భారత స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa ఇండియన్ మార్కెట్ లో కొత్త బడ్జెట్ 43 ఇంచ్ QLED Smart Tv లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో అందించింది. అతి తక్కువ ధరలో వచ్చిన క్యూలెడ్ గూగుల్ టీవీ గా నిలుస్తుంది. ఈ టీవీని మరింత చవక దాతకు అందుకునేలా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా డైవా అందించింది.
డైవా ఇండియాలో కొత్త 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని రూ. 21,999 ధరతో విడుదల చేసింది,. ఈ స్మార్ట్ టీవీని BOBCARD కార్డ్ తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Flipkart నుంచి సేల్ చేస్తోంది.
Also Read: Samsung Galaxy A06: 10 వేల బడ్జెట్ లో కొత్త డిజైన్ బిగ్ బ్యాటరీ తో వచ్చింది.!
డైవా 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 3840 X 2160 రిజల్యూషన్ కలిగిన 4K UHD క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఇది ARM Quad Core A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ టీవీలో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా డైవా అందించింది. ఈ టీవీలో HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ARC, డ్యూయల్ బ్యాండ్ Wi Fi మరియు ఇయర్ ఫోన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ టీవీ Dolby Audio సాపేట్ తో వస్తుంది 24W సౌండ్ అందించే రెండు స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ Netflix, Prime video మరియు Youtube వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ లో MEMC ఫీచర్ ను మాత్రం అందించలేదు. అయినా, మంచి విజువల్స్ అందిస్తుందని డైవా తెలిపింది.