Daiwa, రెండు సైజులలో కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది. ఈ టీవీలను 32 ఇంచులు మరియు 39 ఇంచుల సైజుల్లో ప్రకటించింది. ఈ Daiwa టీవీలు అంతర్నిర్మిత Alexa తో వస్తాయి మరియు హ్యాండ్స్ ఫ్రీ రిమోటుతో వస్తుంది. ఈ రెండు టీవీలు కూడా బాక్స్ స్పీకర్లు, క్వాడ్ కోర్ ప్రొసెసర్ మరియు Big Wall UI తో వస్తాయి.
Daiwa కొత్తగా ప్రకటించిన ఈ రెండు టీవీలు కూడా స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన HD Ready టీవీలు. ఈ రెండు టీవీలు కూడా ఆండ్రాయిడ్ 8.0 OS పైన పనిచేస్తాయి మరియు A35 క్వాడ్ కోర్ ప్రోసెసర్ ని కలిగి ఉంటాయి. ఈ టీవీలు వాయిస్ ఫ్రీ రిమోట్ తో అలెక్సా సపోర్ట్ తో వస్తాయి. కేవలం వాయిస్ కమండ్స్ తో ఈ టీవీలను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
దీని స్మార్ట్ సెర్చ్ – కంటెంట్ డిస్కవరీ ఇంజిన్ (CDE) అందుబాటులో ఉన్న యాప్స్ నుండి సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు మరిన్ని లైబ్రరీ నుండి బ్రౌజ్ చేయడానికి మరియు సెర్చ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు ఆటోమేటిక్ OTA అప్డేట్ లకు మద్దతు ఇస్తుంది.
ఈ Daiwa స్మార్ట్ టివిలలో 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి స్టోరేజ్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీలు చాలా కనెక్టివిటీ ఆప్షన్ లతో వస్తాయి. ఇందులో, 3 HDMI మరియు 2 USB పోర్ట్లతో పాటు ఆడియో పరికరాల కోసం బ్లూటూత్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ కోసం EShare ఇవ్వబడ్డాయి. మీ స్మార్ట్ ఫోన్ ను EShare సహాయంతో నియంత్రణల కోసం ఎయిర్ మౌస్ గా కూడా ఉపయోగించవచ్చు.
ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఈ టీవీలు HD Ready టీవీలు 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తాయి మరియు మంచి కలర్ `అందించడం కోసం ఇందులో క్వాంటమ్ ల్యూమినిట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. అలాగే, మంచి సౌండ్ కోసం 20 W బాక్స్ స్పీకర్లను మరియు సరౌండ్ సౌండ్ సిస్టంతో అందించింది.
Daiwa యొక్క ఈ కొత్త టీవీలలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీని D32S7B మోడల్ నంబరుతో రూ.15,999 ధరతో, 39 ఇంచ్ స్మార్ట్ టీవీని D32S7B మోడల్ నంబరుతో రూ.21,990 రుపాయల ధరతో విడుదల చేసింది.