Daiwa Smart Tv: Alexa సపోర్టుతో రెండు కొత్త స్మార్ట్ టీవీలు రిలీజ్

Daiwa Smart Tv: Alexa సపోర్టుతో రెండు కొత్త స్మార్ట్ టీవీలు రిలీజ్
HIGHLIGHTS

Daiwa, రెండు సైజులలో కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది

ఈ టీవీలను 32 ఇంచులు మరియు 39 ఇంచుల సైజుల్లో ప్రకటించింది.

ఈ టీవీలను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

Daiwa, రెండు సైజులలో కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించింది. ఈ టీవీలను 32 ఇంచులు మరియు 39 ఇంచుల సైజుల్లో ప్రకటించింది. ఈ Daiwa టీవీలు అంతర్నిర్మిత Alexa తో వస్తాయి మరియు హ్యాండ్స్ ఫ్రీ రిమోటుతో వస్తుంది. ఈ రెండు టీవీలు కూడా బాక్స్ స్పీకర్లు, క్వాడ్ కోర్ ప్రొసెసర్ మరియు Big Wall UI తో వస్తాయి.

Daiwa కొత్తగా ప్రకటించిన ఈ రెండు టీవీలు కూడా స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన HD Ready టీవీలు. ఈ రెండు టీవీలు కూడా ఆండ్రాయిడ్ 8.0 OS పైన పనిచేస్తాయి మరియు A35 క్వాడ్ కోర్ ప్రోసెసర్ ని కలిగి ఉంటాయి. ఈ టీవీలు వాయిస్ ఫ్రీ రిమోట్ తో అలెక్సా సపోర్ట్ తో వస్తాయి. కేవలం వాయిస్ కమండ్స్ తో ఈ టీవీలను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

దీని స్మార్ట్ సెర్చ్ – కంటెంట్ డిస్కవరీ ఇంజిన్ (CDE) అందుబాటులో ఉన్న యాప్స్ నుండి సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు మరిన్ని లైబ్రరీ నుండి బ్రౌజ్ చేయడానికి మరియు సెర్చ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు ఆటోమేటిక్ OTA అప్డేట్ లకు మద్దతు ఇస్తుంది.

ఈ Daiwa స్మార్ట్ టివిలలో 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి స్టోరేజ్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీలు చాలా కనెక్టివిటీ ఆప్షన్ లతో వస్తాయి. ఇందులో, 3 HDMI మరియు 2 USB పోర్ట్లతో పాటు ఆడియో పరికరాల కోసం బ్లూటూత్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ కోసం EShare ఇవ్వబడ్డాయి. మీ స్మార్ట్ ఫోన్ ను EShare సహాయంతో నియంత్రణల కోసం ఎయిర్ మౌస్ గా కూడా ఉపయోగించవచ్చు.

ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఈ టీవీలు HD Ready టీవీలు 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తాయి మరియు మంచి కలర్ `అందించడం కోసం ఇందులో క్వాంటమ్ ల్యూమినిట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. అలాగే, మంచి సౌండ్ కోసం 20 W బాక్స్ స్పీకర్లను మరియు సరౌండ్ సౌండ్ సిస్టంతో అందించింది.

Daiwa Smart TV Price

Daiwa యొక్క ఈ కొత్త టీవీలలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీని D32S7B మోడల్ నంబరుతో రూ.15,999 ధరతో,  39 ఇంచ్ స్మార్ట్ టీవీని D32S7B మోడల్ నంబరుతో రూ.21,990 రుపాయల ధరతో విడుదల చేసింది.                                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo