Croma Fire tv ఎడిషన్ టీవీలు లాంచ్ అయ్యాయి. ఈ టీవీలు Dolby Vision మరియు Dolby Atmos తో వస్తాయి. ఈ Croma Tv లు ఆన్లైన్ మరియు ఆఫ్ లో కూడా కూడా లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు పేరు సూచించినట్లుగా Fire Tv ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తాయి. ఈ టీవీలు 5000 కంటే పైచిలుకు యాప్స్ కి సపోర్ట్ చేస్తాయి.
Croma Fire tv ల స్టార్టింగ్ ధర 17,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర స్టార్టింగ్ వేరియంట్ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ధర. 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీని రూ.29,999 రూపాయల ధరతో, 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని రూ.34,999 రూపాయల ధరతో, 50 ఇంచ్ FHD స్మార్ట్ టీవీని రూ.39,999 రూపాయల ధరతో మరియు 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని రూ.49,499 రూపాయల ధరతో ప్రకటించింది.
ఈ Croma Fire tv లు 32 ఇంచ్ HD Ready నుండి మొదలుకొని 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ వరకూ అన్ని విభాగాల్లో కూడా టీవీ లను లాంచ్ చేసింది. ఈ టీవీలు Fire tv OS వెర్షన్ 7.0 పైన పనిచేస్తాయి. ఈ టీవీలు 20W బాక్స్ స్పీకర్లు, డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్ 5.0 తో సహా మరిన్ని ఫీచర్లతో వస్తాయి.