Coocaa తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీని ఇండియాలో విడుదల చేసింది. స్థిరంగా ప్రజాధారణ పొందుతున్న ఈ బ్రాండ్ తన స్మార్ట్ టీవీల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టం (OS) ని కూడా ఈరోజు ప్రకటించింది. కొత్త OS తో విడుదల చేసిన మొదటి స్మార్ట్ టీవీగా S3U-Pro నిలుస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఫీచర్లతో పాటుగా ఆకట్టుకునే బోర్డర్ లెస్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ టీవీ హెవీ సౌండ్ మరియు 5 పిక్చర్ మోడ్స్ తో పాటుగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో వచ్చింది.
Coocaa కొత్తగా ఇండియన్ మర్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ రూ.14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లోకి ప్రవేశించింది మరియు ఈరోజు నుండి ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. అయితే, సెప్టెంబర్ 4 నుండి 6 తేదీ వరకు జరగనున్న సేల్ నుండి కేవలం రూ.12,999 రూపాయల అఫర్ ధరకే Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ మరియు Coolita 1.0 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ పూర్తిగా బెజెల్ లెస్ డిజైన్ తో అందించబడింది మరియు 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది.
ఈ టీవీ ఇన్ బిల్ట్ CC క్యాస్ట్ తో వస్తుంది మరియు ఇది, యూట్యూబ్,Hungama Play, Yupp TV వంటి మరిన్ని యాప్స్ కి మద్దతు ఇస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 512 MB ర్యామ్ మరియు 4జిబి స్టోరేజ్ కలిగివుంది. ఇక సౌండ్ పరంగా ఈ లేటెస్ట్ కూకా స్మార్ట్ టీవీ శక్తివంతమైనది. ఎందుకంటే, ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో 20W సౌండ్ అందించగలదు మరియు Dolby Audio తో పాటుగా సరౌండ్ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది.