ఇండియాలో అతి తక్కువ ధరకే తన స్మార్ట్ టీవీ లను తీసుకొచ్చిన COOCAA సంస్థ.
కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది.
ఇండియాలోని LED టీవీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని, గ్లోబల్ టీవీ బ్రాండ్ అయినటువంటి COOCA తన టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. వాస్తవానికి, ఇప్పటి వరకూ అనేక దేశాలలో తన అమ్మకాలను కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇండియాలో తన LED టీవీలను చాల చౌక ధరలో అందించింది. ఈ LED టీవీలను 32 అంగుళాల పరిమాణం నుండి కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించింది.
ఇక ఈ టీవీల ప్రత్యేకతల విషయాని వస్తే, ఈటీవీలను అనేకమైన ప్రత్యేకతలతో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. వీటిలో, Dolby Vision, Dolby Audio మరియు కళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసే "యాంటీ బ్లూ లైట్ ఐ ప్రొటక్షన్" వంటి వాటిని ముఖ్యమైన వాటిగా చెప్పొచ్చు. అలాగే, చాలా తక్కువ ధరలో అతి సన్నని అంచులు కలిగిన బెజెల్ లెస్ టీవీలను కూడా భారతీయ మార్కెట్లోకి పరిచయం చేసింది.
ఈ LED టీవీల దారాలను పరిశీలిస్తే, ఈ LED టీవీలను కేవలం రూ. 8,999 ప్రారంభ ధరతో అందించింది. అయితే, ఈ ప్రారంభ ధరలో మీకు 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED టీవీ దొరుకుతుంది. అలాగే, ఒక 50 అంగుళాల 4K UHD స్మార్ట్ టీవీని కేవలం రూ. 24,499 రూపాయల ధరకు మరియు 50 అంగుళాల 4K UHD ఆండ్రాయిడ్ టీవీ ని రూ. 28,499 రుపాయల ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. కొత్తగా లాంచ్ చేసిన, ఈ LED టీవీలను ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారం అయినటువంటి Flipakrt ద్వారా అమ్ముడు చేస్తోంది.