CES 2020 : CES ఈవెంట్ కంటే ముందే తన 8K TV రివీల్ చేసిన LG

Updated on 06-Jan-2020
HIGHLIGHTS

LG తన టీవీలు ‘రియల్ 8K ’ అందిస్తున్నాయని నొక్కి మరీ చెప్పింది.

కొన్ని రోజుల క్రితం శామ్సంగ్ తన 8K టివిల సిరీస్ ని ప్రకటించిన తరువాత, ఇప్పుడు LG CES 2020 కంటే ముందుగానే ఎనిమిది 8K  టెలివిజన్ల సిరీస్ తో 8K  ప్రపంచంలోకి దూకినట్లు కనిపిస్తోంది. ఈ ఎనిమిది టివిలలో 2 OLED టెలివిజన్లు ఉన్నాయి, అవి 77 అంగుళాలు మరియు 88 – అంగుళాల ప్యానెల్ పరిమాణంలో, అలాగే 65 మరియు 75-అంగుళాల మధ్య ఉన్న 6 LCD టివిలు ఉన్నాయి. ఈ టెలివిజన్ల ధర ఇంకా ప్రకటించబడలేదు కాని LG తన టీవీలు ‘రియల్ 8K ’ అందిస్తున్నాయని నొక్కి మరీ చెప్పింది.

ఇక ఈ 8K టివిల విషయానికి వస్తే శామ్సంగ్ మరియు LG ల మధ్య పెద్ద యుద్ధమే ఉందని స్పష్టమైంది మరియు LG చేసిన ‘రియల్ 8 K’ వ్యాఖ్య శామ్సంగ్ కి  ప్రత్యక్ష సెటైర్ లాగా కనిపిస్తోంది. అయితే, వాస్తవానికి  8K  ఎలా కొలవాలి అనేదాని గురించి రెండు సంస్థలకు భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. కొంచం క్లుప్తంగా వివరిస్తే, 8 K టీవీల రిజల్యూషన్ 7680×4320 పిక్సెల్స్ మరియు శామ్సంగ్ మరియు LG ఇది సరైన రిజల్యూషన్ అని అంగీకరిస్తున్నాయి. అయితే, రిజల్యూషన్ కొలిచే విధానం ఈ రెండు టెక్ దిగ్గజాల మధ్య కొంత చిచ్చురేపింది. LG ప్రస్తుతం 8K యొక్క CTA (కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్) నిర్వచనాన్ని ఉపయోగిస్తుండగా, శామ్సంగ్ 8K యొక్క 8K అసోసియేషన్ల వర్ణనతో 8K కలిగి ఉంది. ఏది మంచి వ్యవస్థ అని స్పష్టంగా తెలియదు కాని ఈ యుద్ధం ఇప్పుడప్పుడే  ముగిసేలా మాత్రం లేదు .

కానీ, LG యొక్క టీవీలు 8K యొక్క ప్రయోజనాన్నిపూర్తిగా పొందటానికి నిర్మించబడ్డాయి, ఎందుకంటే దాని టీవీలు HEVC, VP9 మరియు AV1 కంటెంట్‌ కు స్థానికంగా మద్దతు ఇస్తాయి. LG యొక్క టీవీలు 8K వద్ద 60fps కంటెంట్‌ ను నిర్వహించడానికి HDMI ఇన్‌ పుట్‌ లతో వస్తాయి. ఈ టీవీలు కొత్త ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి, ఇది వాస్తవానికి వీడియోను 8K మరియు ఆడియోను 5.1 సరౌండ్ సౌండ్‌ కు పెంచగలదు, మీకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ టీవీలు అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, హోమ్‌ కిట్ మరియు ఎయిర్‌ ప్లే 2 లకు కూడా మద్దతు ఇస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :