BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సెగ పుట్టించే బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ ఇదే.!
పెరిగిన టారిఫ్ ధరలతో చాలా మంది యూజర్లు తలలు పట్టుకుంటున్నారు
అందుకే యూజర్లు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు
బిఎస్ఎన్ఎల్ అందించే ఒక సూపర్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది
BSNL: పెరిగిన టారిఫ్ ధరలతో చాలా మంది యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక ఇంట్లో 2 నుంచి మూడు మొబైల్ నెంబర్ లకు రీఛార్జ్ చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందని, యూజర్లు వాపోతున్నారు. అందుకే, యూజర్లు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. వాస్తవానికి, ఈ దారిలో కనిపించేది ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. అందులోనూ బిఎస్ఎన్ఎల్ అందించే ఒక సూపర్ ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈరోజు ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరంగా చూద్దాం.
ఏమిటా BSNL సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ యొక్క బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ (వన్ ఇయర్) ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చూడనున్నది. ఈ రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వన్ ఇయర్ (365 రోజులు) అధిక లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అమౌంట్ ను 12 నెలలకు సమానంగా లెక్కగడితే, నెలకు కేవలం రూ. 100 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇంత తక్కువ ధరలో వ్యాలిడిటీ, కాలింగ్ మరియు డేటా అందించే మరో ప్లాన్ లేదని తడుముకోకుండా చెప్పవచ్చు.
Also Read: Realme Narzo 70 Turbo: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
BSNL రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ల మాదిరిగా కాకుండా 12 నెలలు విడివిడి లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో ప్రతి నెలా 300 నిముషాల కాలింగ్ మినిట్స్, నెలకు 3GB డేటా మరియు 30 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ విధంగా 212 నెల పాటు పైన తెలిపిన ప్రయోజనాలను సంవత్సరం మొత్తం అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణ యూజర్ కు సరిపోతుంది. ఒకవేళ ఈ ప్లాన్ తో అందించే కాలింగ్, డేటా మరియు SMS లిమిట్ ముగిసిపోతే ఇప్పుడు చెప్పే చార్జీలు వర్తిస్తాయి. లిమిట్ ముగిసిన తర్వాత లోకల్ కాల్ కోసం నిమిషానికి రూ.1, STD కాల్ కోసం నిమిషానికి రూ.1.30 పై, లోకల్ SMS కు 80 పైసలు, నేషనల్ SMS కు 1.20 పైసలు మరియు 1MB డేటా కోసం 25 పైసల చొప్పున ఛార్జ్ లు వర్తిస్తాయి.
బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మీ మొబైల్ రీఛార్జ్ కోసం Click Here