BSNL Best Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒక బెస్ట్ ప్లాన్ కేవలం రోజు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. చవక ధరలో అన్ని ప్రయోజనాలు ఎక్కువ రోజులు కోరుకునే బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలనలోకి తీసుకోవచ్చు.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 249 రూపాయలలో 45 రోజుల వ్యాలిడిటీ మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈరోజు ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఈ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు చెల్లుబాటు అవుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు రోజుకు 2GB హై స్పీడ్ డేట్ మరియు 4Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అయితే, ఇతర ప్లాన్స్ నుంచి మైగ్రేషన్ అయ్యే వారికి ఈ ప్లాన్ వర్తించదు.
మరింత తక్కువ ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలు అందించే మరొక ప్లాన్ కూడా వుంది. అదే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 5 ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజుల \వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ 150 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా మరియు లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు ఎక్కువ రోజులు అందించే ప్లాన్ గా నిలుస్తుంది. డైలీ అధిక డేట్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోదు.
Also Read: Amazon GIF sale బిగ్ డీల్ : 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart Tv అందుకోండి.!
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here