BSNL 4G: దేశవ్యాప్తంగా 35 వేల ప్రాంతాల్లో 4G సర్వీస్ అందుబాటులోకి తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!
ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది
BSNL 4G 35 వేల ప్రాంతాల్లో 4G సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది
గడిచిన 100 రోజుల్లో 7000 లకు పైగా ప్రాంతాల్లో 4G నెట్ వర్క్ అందించినట్లు తెలుస్తోంది
BSNL 4G: ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. దేశంలో ఎప్పటి వరకు 4G నెట్ వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఎద్దేవా చేసే వారి నోటికి తాళం వేస్తూ కొత్త ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 35 వేల ప్రాంతాల్లో 4G సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. వాస్తవానికి, ఈ ప్రకటన టెలికాం మినిస్టర్, జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించినట్లు నివేదికలు తెలిపాయి.
BSNL 4G
బిఎస్ఎన్ఎల్ కొత్త జత చేసిన ప్రాంతాలతో కలిపి మొత్తం 35,000 ఏరియాల్లో 4G సర్వీసులను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు టెలికాంటాక్ తెలిపింది. అయితే, ఈ న్యూస్ ను ఇండియా టీవీ ముందుగా అందించినట్లు కూడా తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, గడిచిన 100 రోజుల్లో 7000 లకు పైగా ప్రాంతాల్లో 4G నెట్ వర్క్ అందించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, 2025 మధ్య కాలానికి దేశంలో పూర్తిగా 4G విస్తరించే దిశగా బిఎస్ఎన్ఎల్ పని చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అందుకే, అతివేగంగా 4G నెట్ వర్క్ ను శరవేగంగా తీసుకొస్తున్నట్లు కూడా తెలిపింది. ఇటీవలే, BSNL 5G నెట్ వర్క్ పై వీడియో కాల్ ను కూడా బిఎస్ఎన్ఎల్ నిర్వహించింది. త్వరలోనే వేగవంతమైన బిఎస్ఎన్ఎల్ 4G సేవలు కూడా తీసుకు వస్తుందని నిపుణులు లెక్కలు వేసి చెబుతున్నారు.
అయితే, వాస్తవానికి బిఎస్ఎన్ఎల్ నుండి ఈ కొత్త విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. కానీ దేశంలోని పల్లె ప్రాంతాలు కలుపుతూ అన్ని ప్రాంతాలకు వేగవంతమైన నెట్ వర్క్ అందించే దిశగా బిఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తున్నట్లు మాత్రం కనిపిస్తోంది.
Also Read: Motorola razr 40 Ultra పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్: సగం ధరకే లభిస్తున్న ఫోల్డ్ ఫోన్.!
ఇక ఇటీవల చేప్పట్టిన 4G SIM అప్గ్రేడ్ తో బిఎస్ఎన్ఎల్ ఎఫర్ట్ కనిపిస్తోంది. దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ను సంప్రదించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ యూజర్లు 4G సిమ్ కార్డు కు అప్గ్రేడ్ కావచ్చు. అయితే, చూడాలి బిఎస్ఎన్ఎల్ ఎంత త్వరగా దేశంలో పూర్తిగా 4G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకు వస్తుందో.
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ చెక్ చేయడానికి మరియు రీచార్జ్ చేయడానికి Click Here