Smart TV: బడ్జెట్ ధరలో సైబర్ సౌండ్ టెక్ తో వచ్చిన కొత్త స్మార్ట్ టీవీలు

Smart TV: బడ్జెట్ ధరలో సైబర్ సౌండ్ టెక్ తో వచ్చిన కొత్త స్మార్ట్ టీవీలు
HIGHLIGHTS

బ్లూపంక్ట్ ఆండ్రాయిడ్ టీవీ

బ్లూపంక్ట్ made in India టీవీ

సరికొత్త సైబర్ సౌండ్ తో వచ్చాయి

ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ ఇండియాలో నాలుగు లేటెస్ట్ స్మార్ట్ టీవీలను మంచి ఫీచర్లతో ఆవిష్కరించింది. ఈ టీవీలను భారతదేశంలో తయారు చెయ్యడానికి బ్లూపంక్ట్ సంస్థ ఇండియాలోని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్.పి.పి.ఎల్) తో భాగస్వామిగా చేసుకోంది. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా, ఈ టీవీలను పూర్తిగా భారతదేశంలో తయారుచేసింది. బ్లూపంక్ట్ కొత్తగా విడుదల చేసిన ఈ నాలుగు టీవీలు కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తాయి మరియు సరికొత్త సైబర్ సౌండ్ తో వస్తాయి. ఈ టీవీలు 32 ఇంచ్ నుండి 55 ఇంచ్ వరకూ అందించింది.

బ్లూపంక్ట్ ఆండ్రాయిడ్ టీవీ: ప్రైస్&స్పెక్స్ 

ఈ టీవీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ రూ.14,999 రూపాయల నుండి మొదలవుతుంది. ఈ ధర 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ సైబర్‌సౌండ్ ఆండ్రాయిడ్ టీవీ కోసం నిర్ణయించబడింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఆండ్రాయిడ్ 9 OS తో వస్తాయి. అంతేకాదు,1 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తాయి. ఇవి తక్కువ అంచు కలిగిన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఈ టీవీలు రెండు స్పీకర్లతో టోటల్ 40W సౌండ్ అవుట్‌పుట్‌ అందిస్తాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఎడ్జ్-ఫ్రీ సౌండ్ టెక్నాలజీతో వస్తాయి.                           

ఇక 43 ఇంచ్ సైబర్‌సౌండ్స్ 4 కె ఆండ్రాయిడ్ టివి ధర రూ .30,999. ఇది కూడా చాలా సన్నని అంచులు కలిగిన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ర్ టీవీ 4 స్పీకర్లతో మొత్తంగా 50 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌ ఆండీస్`అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్, DTS  ట్రూ సారౌండ్ సర్టిఫైడ్ ఆడియోతో కూడా వస్తుంది. అధనంగా, ఈ టీవీలో Dolby MS 12 సౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది Dolby Atmos  మరియు డాల్బీ డిజిటల్ ప్లస్‌ను డీకోడ్ చేసి మెరుగుపరుస్తుంది. ఈ 4కె స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 10 తో వస్తుంది మరియు దీనికి జతగా 8 జిబి స్టోరేజ్‌, 2 జిబి ర్యామ్‌ను కూడా కలిగి ఉంటుంది. 

ఇక హై ఎండ్ వేరియంట్ స్మార్ట్ టీవీ పెద్ద 55 ఇంచ్ 4 కె ఆండ్రాయిడ్ టివి మరియు దీని ధర రూ .40,999. ఈ టీవీ టోటల్ 60 W  అవుట్‌పుట్‌ అందించగల నాలుగు స్పీకర్లను కలిగి ఉంటుంది. 43-అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరిగా, ఇది కూడా డాల్బీ డిజిటల్ ప్లస్, DTS  ట్రూసరౌండ్ సర్టిఫైడ్ ఆడియో, Dolby MS12 సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ను కలిగి ఉంది మరియు 2 జిబి ర్యామ్ మరియు 8 జిబి స్టోరేజ్ ని ప్యాక్ చేస్తుంది.

Rajat Motwani
Digit.in
Logo
Digit.in
Logo