చవక ధరకే మూడు కొత్త 4K QLED టీవీలను లాంచ్ చేసిన జర్మన్ బ్రాండ్.!

Updated on 12-Sep-2022
HIGHLIGHTS

మూడు కొత్త 4K QLED టీవీలను లాంచ్ చేసిన Blaupunkt

ఈ కొత్త టీవీలను 50, 55 మరియు 65 ఇంచ్ పరిమాణంలో తీసుకొచ్చింది

ఈ టీవీలు Flipkart అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి

ప్రముఖ జర్మన్ బ్రాండ్ ఆడియో బ్రాండ్ Blaupunkt ఈరోజు ఇండియాలో మూడు కొత్త 4K QLED టీవీలను లాంచ్ చేసింది. ఈ కొత్త టీవీలను 50, 55 మరియు 65 ఇంచ్ పరిమాణంలో తీసుకొచ్చింది. ఈ టీవీలు Flipkart అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ టీవీలు ఇండియన్ మార్కెట్లో రూ.36,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేయబడ్డాయి. ఇండియన్ మార్కెట్లో బ్లూపంక్ట్ ఆవిష్కరించిన ఈ కొత్త 4K QLED టీవీల ధర మరియు ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా.

Blaupunkt ఈ కొత్త సిరీస్ టీవీ లను 4K QLED స్క్రీన్ తో అందించింది. ఈ టీవీ లలో ఆడియోను కూడా ఆకట్టుకునే విదంగా అందించింది. ఈ టీవీలు 60W హెవీ సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. ఈ టీవీ లలో చాలా దూరం నుండి కూడా వాయిస్ ను గుర్తించగల ఫార్ ఫీల్డ్ గూగుల్ అసిస్టెంట్ ను కూడా జతచేసింది.

ఈ 4K QLED టీవీలు బెజెల్-లెస్ మరియు ఎయిర్-స్లిమ్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. Google TV యొక్క కొత్త యూజర్ ఇంటర్ ఫేజ్ అనుభవం కూడా బాగుంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ లలో 3 HDMI, 2USB, బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉన్నాయి.

ఈ కొత్త టీవీల ధర విషయానికి వస్తే, స్టార్టింగ్ 50 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీ రూ.36,999 ధరతో, 55 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీ రూ.44,999 ధరతో మరియు 65 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీని రూ.62,999 ధరతో విడుదల చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :