కొత్త స్మార్ట్ టీవీ: 40W హెవీ సౌండ్.. లేటెస్ట్ ఫీచర్లతో కొత్త టీవీలు ప్రకటించిన Blaupunkt
Blaupunkt ఇండియన్ మార్కెట్లో మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది
ఈ రెండు కొత్ స్మార్ట్ టీవీలను Cybersound సిరీస్ నుండి ప్రకటించింది
40 ఇంచ్ మరియు 43 ఇంచ్ రెండు సైజులో టీవీలను విడుదల చేసింది
ప్రముఖ జర్మనీ ఆడియో పరికరాల తయారీ కంపెనీ Blaupunkt ఇండియన్ మార్కెట్లో మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ రెండు కొత్ స్మార్ట్ టీవీలను Cybersound సిరీస్ నుండి ప్రకటించింది. సైబర్ సౌండ్ సిరీస్ హెవీ సౌండ్ అందించగల టీవీలు అందిస్తున్న సిరీస్ గా ఇండియాలో ఇప్పటికే పరిచయముంది. ఇప్పుడు ఈ సిరీస్ నుండి ఆకర్షనీయమైన ధరలోనే 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ రెండు సైజులో టీవీలను విడుదల చేసింది.
Blaupunkt Cybersound: ధర మరియు ఆఫర్లు
ఈ బ్లూప్లంక్ట్ సైబర్ సౌండ్ కొత్త 40-అంగుళాల టీవీ ధర 15,999 మరియు 43-అంగుళాల FHD TV ధర రూ.19,999. ఈరెండు స్మార్ట్ టీవీలు కూడా మార్చి 12 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడతాయి. ఈ టీవీలను SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.
Blaupunkt Cybersound: ఫీచర్లు
Blaupunkt తన సైబర్ సౌండ్ లైనప్ కు 40-ఇంచ్ HD-Ready (1366 x 768 పిక్సెల్స్) మరియు 43-అంగుళాల FHD టీవీలను కొత్తగా జోడించింది. వీటిలో, 40 ఇంచ్ స్మార్ట్ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండగా, 43 ఇంచ్ టీవీ 500 నిట్స్ బ్రైట్నెస్స్ కలిగివుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా HDR10 కంటెంట్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ టీవీలు 40-వాట్ సౌండ్ అందించగల 2-స్పీకర్ యూనిట్స్ నుండి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అలాగే, స్పష్టమైన ఆడియో కోసం ఈ టీవీలలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్స్ జతచేయబడింది. ఇన్‌పుట్-అవుట్‌పుట్ ఎంపికల కోసం Chromecast, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు వున్నాయి. ఈ టీవీలు 1.4 GHz కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ టీవీలు 1GB RAM, 8 GB స్టోరేజ్ వస్తాయి మరియు Android TV (v9) సాఫ్ట్‌వేర్ పైన రాం అవుతాయి.