రూ.13 వేలకే 32 ఇంచ్ లేటెస్ట్ HDR స్మార్ట్ టీవీ కావాలా.. !!
HDR 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.13,499 మాత్రమే
బడ్జెట్ ధరలో లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ
ఈ స్మార్ట్ టీవీలు HDR సపోర్ట్ మరియు హెవీ సౌండ్ తో వస్తాయి
Blaupunkt ఇటీవల రెండు కొత్త స్మార్ట్ టీవీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Cybersound సిరీస్ నుండి తీసుకువచ్చిన ఈ స్మార్ట్ టీవీలు HDR సపోర్ట్ మరియు హెవీ సౌండ్ తో వస్తాయి. సైబర్ సౌండ్ సిరీస్ అంటేనే హెవీ సౌండ్ అందించగల టీవీలకు పెట్టింది పేరుగా ఇండియాలో ఇప్పటికే పరిచయముంది. ఈ సైబర్ సౌండ్ సిరీస్ నుండి అందించిన రెండు టీవీలలో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.13,499 మాత్రమే. ఈ టీవీ ఫీచర్లు మరియు ఇదే సిరీస్ నుండి బడ్జెట్ ధరలో లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీల వివరాలను కూడా చూద్దాం.
Blaupunkt Cybersound: ధర మరియు ఆఫర్లు
ఈ బ్లూప్లంక్ట్ సైబర్ సౌండ్ కొత్త 32 ఇంచ్ టీవీ రూ.13,499 ధరతో, 40-అంగుళాల టీవీ రూ.15,999 ధరతో మరియు 43-అంగుళాల FHD TV రూ.19,999 ధరతో Flipkart నుండి లభిస్తున్నాయి. ఈ టీవీలను HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Blaupunkt Cybersound: ఫీచర్లు
ఈ Blaupunkt సైబర్ సౌండ్ స్మార్ట్ టీవీ 32ఇంచ్ మరియు 40-ఇంచ్ టీవీలు HD-Ready (1366 x 768 పిక్సెల్స్) మరియు 43-అంగుళాల FHD రిజల్యూషన్ తో వస్తాయి. వీటిలో, 32 మరియు 40 ఇంచ్ స్మార్ట్ టీవీలు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండగా, 43 ఇంచ్ టీవీ 500 నిట్స్ బ్రైట్నెస్స్ కలిగివుంది. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా HDR కంటెంట్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ టీవీలు 40-వాట్ సౌండ్ అందించగల 2-స్పీకర్ యూనిట్స్ నుండి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అలాగే, స్పష్టమైన ఆడియో కోసం ఈ టీవీలలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్స్ జతచేయబడింది. ఇన్‌పుట్-అవుట్‌పుట్ ఎంపికల కోసం Chromecast, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్, 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు వున్నాయి. ఈ టీవీలు 1.4 GHz కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తాయి. ఈ టీవీలు 1GB RAM, 8 GB స్టోరేజ్ వస్తాయి మరియు Android TV (v9) సాఫ్ట్‌వేర్ పైన రన్ అవుతాయి.
వీటిలో, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 2021 లో విడుదల కాగా, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు 2022 మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చాయి. Check Offers Here