Blaupunkt, ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ రీసెంట్ గా మూడు కొత్త 4K QLED టీవీలను ఇండియాలో విడుదల చేసింది. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి ఈ కొత్త టీవీలు సేల్ కి అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ మార్కెట్లో బ్లూపంక్ట్ ఈ టీవీలను రూ.36,999 ప్రారంభ ధరతో అందించింది. ఇది 50 ఇంచ్ వేరియంట్ ధర కోసం అందించింది. ఈ సిరీస్ నుండి మొత్తం మూడు టీవీలను, మూడు సైజుల్లో అందించింది. ఈ కొత్త 4K QLED టీవీలు ఎటువంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయో చూద్దామా.
Blaupunkt ఈ కొత్త సిరీస్ టీవీ లను 4K QLED స్క్రీన్ తో అందించింది. ఈ టీవీ లలో ఆడియోను కూడా ఆకట్టుకునే విదంగా అందించింది. ఈ టీవీలు 60W హెవీ సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. ఈ టీవీ లలో చాలా దూరం నుండి కూడా వాయిస్ ను గుర్తించగల ఫార్ ఫీల్డ్ గూగుల్ అసిస్టెంట్ ను కూడా జతచేసింది.
ఈ 4K QLED టీవీలు బెజెల్-లెస్ మరియు ఎయిర్-స్లిమ్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. Google TV యొక్క కొత్త యూజర్ ఇంటర్ ఫేజ్ అనుభవం కూడా బాగుంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ లలో 3 HDMI, 2USB, బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉన్నాయి
ఈ కొత్త టీవీల ధర విషయానికి వస్తే, స్టార్టింగ్ 50 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీ రూ.36,999 ధరతో, 55 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీ రూ.44,999 ధరతో మరియు 65 ఇంచ్ వేరియంట్ 4K QLED టీవీని రూ.62,999 ధరతో విడుదల చేసింది.