ఫ్లిప్‌కార్ట్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి మంచి అఫర్ అందుబాటులో వుంది. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి TCL యొక్క పెద్ద iFFALCON 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే అమ్ముడు చేస్తోంది. ఈ అఫర్ మరియు ఈ టీవీ టీవీ ప్రత్యేకతల గురించి ఈ క్రింద చూడవచ్చు.
ఈ 4K Smart Android TV యొక్క MRP ధర 47,990 గా ఉండగా దీనిపైన 47% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రుపాయల ధరకే ఈ సేల్ నుండి లభిస్తుంది. అదనంగా, ICICI క్రెడిట్ కార్డుతో కొనేవారికి 1500 వరకు, ICICI డెబిట్ కార్డుతో కొనేవారికి 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది.
ఈ 43 అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K UHD తో వస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ కూడా ఇందులో వుంది. కాబట్టి, మంచి పిక్చర్ క్వాలిటీ మీకు అందుతుంది. అంతేకాదు, ఇందులో HDR 10 సపోర్ట్ మరియు ఆడియో పరంగా Dolby Atmos తో వస్తుంది. ఇందులో వున్న స్పీకర్లు 24W పెద్ద సౌండ్ అందిచగలవు. ముఖ్యంగా, ఇది Ai -iN తో వస్తుంది కాబట్టి వాయిస్ కమాండ్స్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 pie OS పైన పని చేస్తుంది.