శామ్సంగ్ కొత్త స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్..

Updated on 24-Jun-2022
HIGHLIGHTS

Samsung క్రిస్టల్ 4K నియో టీవీ పైన బిగ్ డీల్

2,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు

ఈ టీవీ Crystal Processor 4K కి జతగా 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది

శామ్సంగ్ ఇండియాలో కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ టీవీ Samsung Crystal 4K Neo TV పైన డీల్ అందుకోండి.  క్రిస్టల్ సిరీస్ నుండి మంచి ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త స్మార్ట్ టీవీ పైన 2,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ  స్మార్ట్ టీవీ వన్ బిలియన్ ట్రూ కలర్స్ తో అందించగలదు మరియు Crystal 4K ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ ఈ శామ్సంగ్ కొత్త స్మార్ట్ టీవీ పైన అఫర్ చేస్తున్న ఆ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా. 

Samsung Crystal 4K Neo TV: ధర మరియు ఆఫర్స్

శామ్సంగ్ క్రిస్టల్ 4కె నియో స్మార్ట్ టీవీ రూ.35,990 ధరతో వచ్చింది. ఇది 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం నిర్ణయించబడిన ధర మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా వుంది.

ఆఫర్స్:

ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియా నుండి HDFC, HSBC, Yes బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేసే వినియోగదారులు 1,500 నుండి 2,000 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క వార్షిక సభ్యత్వాన్ని కూడా ఉచితంగా పొందవచ్చు. Buy From Here

Samsung Crystal 4K Neo TV: స్పెక్స్

శామ్సంగ్ క్రిస్టల్ 4కె నియో స్మార్ట్ టీవీని క్రిస్పీ మరియు పదునైన పిక్చర్ క్వాలిటీ కోసం క్రిస్టల్ టెక్నాలజీతో 43-అంగుళాల USD డిస్ప్లేని కలిగి ఉంది. ఇది HDR10+, వన్ బిలియన్ ట్రూ కలర్స్ మరియు క్రిస్టల్ 4K ప్రాసెసర్‌కి కూడా మద్దతు ఇస్తుంది.ముఖ్యంగా, ఈ టీవీలో కొన్ని గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అవి ఆటో గేమ్ మోడ్, మెరుగైన ఫ్రేమ్ ట్రాన్సిషన్ మరియు Low Latency కోసం మోషన్ ఎక్స్‌లరేటర్ వంటివి.

ఇక ఆడియో మరియు కనక్టివిటి పరంగా, Dolby Digital Plus మరియు స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీలో 3HDMI, 1USB పోర్ట్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Crystal Processor 4K కి జతగా 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్, బిక్స్ బై మరియు అలెక్సా సపోర్ట్‌తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :