ఇండియాలో కేవలం రూ.15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరలోనే లభిస్తున్న బెస్ట్ 32 స్మార్ట్ టీవీల కోసం మీరు వెతుకుతున్నట్లయితే, మీకు మార్కెట్లో చాలానే అప్షన్స్ ఉన్నాయి. అయితే, కొన్ని స్మార్ట్ టీవీలు వాటి స్పెక్స్ షీట్ మరియు ఫీచర్ల పరంగా గొప్పగా ఉంటాయి. 32 ఇంచ్ టీవీలు మీ బెడ్ రూమ్ కోసం బాగా అనువైనవి మరియు మీ బాడ్జెట్ కు అనువైనవి. ఈ టీవీలు HD రెడీ రిజల్యూషన్ తో వస్తాయి మరియు స్మార్ట్ ఫీచర్లను కలిగివుంటాయి. ఇటీవలి కాలంలో టీవీ కాంపోనెంట్‌ల ధర పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఒకప్పుడు ఈ టీవీల్లో కొన్ని టీవీలు రూ. 15,000 కంటే తక్కువ ధర ఉన్న ఇప్పుడు రూ. 15,000 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఈ స్మార్ట్ టీవీలు డబ్బుకు తగిన విలువను అందిస్తాయి.
ధర: రూ.14,999
Mi TV 4A Pro HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ షియోమి యొక్క సొంత UI ప్యాచ్ వాల్ ఓస్ పైన నడుస్తుంది మరియు Android TV UI ఎంపికను కూడా అందిస్తుంది. ఈ టీవీ DTS-HD తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది.
ధర: రూ.16,999
Hisense 32A56E కూడా HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ DTS Studio Sound సౌండ్ టెక్నలాజిని సపోర్ట్ మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది.ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది. ఇది అధికారిక ఆండ్రాయిడ్ 9.0PIE OS పైన నడుస్తుంది.
ధర: రూ.15,999
ఇది AmazonBasics Fire TV ఎడిషన్ టీవీ HD రిజల్యూషన్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇందులో మీ కనెక్టివిటీ అవసరాల కోసం ఈ స్మార్ట్ టీవిలో 2 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Fire TV OS పైన నడుస్తుంది మరియు Fire TV Stick ను కనెక్ట్ చెయ్యకుండానే ఇది Fire TV UI ని అందిస్తుంది. అంటే మీరు ఈ టీవీలో అనేక స్ట్రీమింగ్ సర్వీస్ లకు యాక్సెస్ అందుకుంటారు. రిమోట్ కంట్రోల్ తో పాటు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ మ్యూజిక్ కోసం OTT హాట్‌కీలను కూడా అందిస్తుంది. ఈ టీవీ Alexa ఎనేబుల్ తో వస్తుంది కాబట్టి, ఇతర పరికరాలను కూడా ఈ టీవీతో నియంత్రించవచ్చు.
ధర: రూ.12,999
Thomson 9A Series కూడా HD Ready రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు డేడికేటెడ్ OTT హాట్ కీస్ కలిగిన రిమోట్ కంట్రల్ తో ఉంటుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ UI పైన నడుస్తుంది మరియు Google Play స్టోర్‌కు కూడా యాక్సెస్ పొందుతారు.
ధర: రూ.12,499
Infinix X1 HD Ready స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ UI పెయిన్ నడుస్తుంది. ఈ HD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజిని కూడా కలిగి ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో 2 HDMI పోర్ట్‌లు మరియు 1 USB పోర్ట్‌లు ఉన్నాయి. మీకు నచ్చిన లేదా అవసరమైన Apps డౌన్ లోడ్ చేసుకోవడానికి 8GB ఇంటర్నల్ మెమొరీ కూడా వుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని యాప్స్ కు మద్దతునిస్తుంది.
Note: ఆన్లైన్ ధరల కారణంగా పైన సూచించిన స్మార్ట్ టీవీల ధరలో మార్పులు సంభవించవచ్చు.