8 వేల కంటే తక్కువ ధరలో పెద్ద Smart Tv కోసం చూస్తున్నారా..!

Updated on 15-Jul-2024
HIGHLIGHTS

10 వేల కంటే తక్కువ ధరలో పెద్ద Smart Tv డీల్స్

పెద్ద స్మార్ట్ టీవీ లను బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేటుకే పొందవచ్చు

అదనపు లాభాలను అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో కూడా లభిస్తున్నాయి

10 వేల కంటే తక్కువ ధరలో పెద్ద Smart Tv కోసం చూస్తున్నారా? అయితే, ఈ రోజు నేను మీకు సహాయం చేయనున్నాను. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సైట్ లలో చాలా స్మార్ట్ టీవీలు డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం. ఈ పెద్ద స్మార్ట్ టీవీ లను 8 వేల కంటే తక్కువ ధరలో, ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేటుకే పొందవచ్చు.

Smart Tv : ఆఫర్లు

ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు అదనపు లాభాలను అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో కూడా లభిస్తున్నాయి.

best Smart Tv Deals

Kodak (32 ఇంచ్) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ.8,499

కోడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32SE5001BL ఈరోజు అమెజాన్ నుండి 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ టీవీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ మరియు Linux OS తో పని చేస్తుంది. ఈ టీవీలో HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు మిరాకాస్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. 30W సౌండ్ అందించే స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా వుంది. Buy From Here

Coocaa (32 ఇంచ్) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ.8,499

కూకా బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ రూ. 10,999 ధరతో వచ్చింది. అయితే, రూ. 2,500 డిస్కౌంట్ తో కేవలం రూ. 8,499 ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ DLED స్క్రీన్ తో వస్తుంది మరియు Coolita OS పై పని చేస్తుంది. ఈ టీవిలో 20W సౌండ్ అందించే స్పీకర్లు మరియు Dolby Audio సపోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ కూడా HDMI, USB, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు స్క్రీన్ షేరింగ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ పైన 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది.

Also Read: OnePlus 12 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!

Thomson Alpha (32 ఇంచ్) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ.8,499

థాంసన్ ఆల్ఫా సిరీస్ నుంచి వచ్చిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తోంది. అదనంగా, ఈ టీవీని Axis మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీని 8 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ స్క్రీన్, 30W సౌండ్ అందించే స్పీకర్లు, సరౌండ్ సౌండ్, HDMI, USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :