Best Budget Smart TV : రూ. 10,000 కంటే తక్కువ ధరలో 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీలు
ఈ టీవీలకు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన రూ .7 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
Best Budget Smart TV : మీరు మీ పాత టీవీకి బదులుగా మీ బడ్జెలోపే ఒక టీవీని పొందవచ్చు.
మీ బడ్జెట్‌లో ఏ టీవీ మెరుగ్గా ఉంటుందో చెప్పడానికి మేము ఇక్కడ ఒక లిస్ట్ అందించాము.
Best Budget Smart TV : మీరు మీ పాత టీవీకి బదులుగా కొత్త స్మార్ట్ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే, మీరు మార్కెట్‌లోని అన్ని కంపెనీల స్మార్ట్ టీవీలను చూడవచ్చు. మీ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ, మీరు మీ బడ్జెలోపే ఒక టీవీని పొందవచ్చు. మీ బడ్జెట్‌లో ఏ టీవీ మెరుగ్గా ఉంటుందో చెప్పడానికి మేము ఇక్కడ ఒక లిస్ట్ అందించాము.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం భయాందోళనలో ఉంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండే పని చేయమని కోరుతున్నాయి. దాదాపుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అందుకేకావచ్చు, Netflix, YouTube, Amazon Prime Video వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలకు డిమాండ్ పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పాటుగా స్మార్ట్ టీవీలలో ఇతర ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలను కూడా ఉపయోగించవచ్చు.
కానీ ఎక్కువగా స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లకు బదులుగా పెద్ద తెరపై ఉత్తమ అనుభవాన్ని ఇస్తాయి. మీరు స్మార్ట్ టీవీకి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే మరియు అదే సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే, మేము మార్కెట్లో ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ టీవీల జాబితాను రూ .10,000 కన్నా తక్కువకు ధరలోనే అందుబాటులో ఉంచాము. ఈ టీవీల్లో 32 అంగుళాల LED డిస్‌ప్లే ఉంటుంది. ఈ టీవీలకు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన రూ .7 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
Best Budget Smart TV జాబితా
Thomson 32M3277 32 inch LED HD-Ready TV
Price- రూ. 9,999
థామ్సన్ యొక్క ఈ 32 ఎమ్ 3277 32-అంగుళాల ఎల్‌ఇడి హెచ్‌డి-రెడీ మోడల్‌లో 32 అంగుళాల LED డిస్‌ప్లే 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, Wi -Fi , 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, వెబ్ బ్రౌజర్‌లు మరియు ఇతర యాప్స్ ను కలిగి ఉంది. ఈ టీవీ పైన రూ .6 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
Micromax HD Re ady LED TV (32T8361HD)
Price : రూ .9,499
మైక్రోమాక్స్ యొక్క ఈ మోడల్ రూ .6,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ను అందిస్తుంది. ఈ టీవీ యొక్క ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 32-అంగుళాల LED స్క్రీన్ టీవీ, ఇది HD రెడీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఉంటుంది. వెనుక 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు కూడా ఉన్నాయి.
Vu 80cm HD Ready LED TV with FM Radio(32BFM)
Price : రూ .8,999
ఇది 32 అంగుళాల టీవీ. దీని రిజల్యూషన్ HD రెడీ 1366 x 768 పిక్సెళ్ళు. ఈ టీవీలో డిస్ప్లే సైజు 80 సెం.మీ (32), LED స్క్రీన్, 1 HDMI పోర్ట్, 1 USB పోర్ట్ ఉన్నాయి. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, డిజిటల్ సౌండ్ ఫిల్టర్ కి కూడా మద్దతును కూడా కలిగి ఉంది. ఈ టీవీ కూడా రూ .6 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
BPL T32SH30A 32 inch LED HD-Ready TV
Price: రూ .8,499
1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 32 అంగుళాల LED డిస్‌ప్లేను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2 USB పోర్ట్‌లు, HDMI పోర్ట్‌లు, Wi-Fi, యాప్స్ మరియు వెబ్ బ్రౌజర్ ఫీచర్లు కూడా ఉంటాయి. మీరు మీ పాత టీవీ ఎక్స్చేంజి ద్వారా కొత్త టీవీని కొనాలనుకుంటే, ఈ మోడల్ పైన మీకు రూ .6,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.
Kodak XPRO HD Ready LED Smart TV (32HDXSMART)
Price : రూ .9,499
ఇది 32 అంగుళాల టీవీ. దీని రిజల్యూషన్ HD రెడీ 1366 x 768 పిక్సెళ్ళు. టీవీ డిస్ప్లే సైజు 80 సెం.మీ (32), LED స్క్రీన్, 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, వై-ఫై సపోర్ట్ కూడా కలిగి ఉంది. యాప్స్ మరియు వెబ్ బ్రౌజర్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ టీవీ పైన రూ .6 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తాయి.