బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈ రోజు మంచి స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ నుంచి వచ్చిన 50 ఇంచ్ 4K UHD Smart Tv పై అమెజాన్ ఇండియా ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్ ద్వారా ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని 24 వేల రూపాయల బడ్జెట్లో అందుకునే అవకాశం ఉంది.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఇండియా ఈ డీల్ ను అందించింది. Kodak CA PRO సిరీస్ (50) ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50CAPROGT5012 పై ఈ ఈరోజు అమెజాన్ 35% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ కొడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 26,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీ పై మరొక బెస్ట్ డీల్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Pixel క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, ఈ టీవీని ఈ ఆఫర్ తో కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Realme 14x 5G సెగ్మెంట్ ఫస్ట్ IP69 రేటింగ్ స్మార్ట్ ఫోన్ గా విడుదలకు సిద్ధం.!
ఈ కొడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ HDR10+, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 (4K) రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ మోషన్ సెన్సార్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A53 క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ ను కలిగి ఉంటుంది.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ Netflix, prime Video, Disney+Hotstar తో సహా అనేక యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.