భారీ డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న పెద్ద 4K QLED Smart Tv డీల్స్ ఇవే.!

17 వేల బడ్జెట్ ధరలో కొత్త 4K QLED Smart Tv డీల్స్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి
ఈ స్మార్ట్ టీవీలు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి 17 వేల బడ్జెట్ లోనే లభిస్తాయి
20 వేల బడ్జెట్ ధరలో కొత్త 4K QLED Smart Tv డీల్స్ కోసం చూస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ డీల్స్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే 43 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు. అందుకే, ఈ బెస్ట్ డీల్స్ ను గురించి ఈరోజు అందిస్తున్నాను.
ఏమిటా 4K QLED Smart Tv డీల్స్?
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు ఇన్ఫినిక్స్ మరియు థాంసన్ రెండు స్మార్ట్ టీవీ లను ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి 17 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తాయి.
Infinix (43) 4K QLED Smart Tv
ఇన్ఫినిక్స్ యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ టీవీని HDFC క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో 12 నెలల EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 16,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో Dolby Audio సపోర్ట్, 40W సౌండ్ అవుట్ పుట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు మరిన్ని ఫీచర్స్ ఉంటాయి.
Also Read: లేటెస్ట్ 1.5 Ton Split AC గొప్ప డిస్కౌంట్ తో 30 వేల ధరలో లభిస్తోంది.!
Thomson Jio TV (43) QLED Smart Tv
జియో టెలీ OS సపోర్ట్ తో Thomson అందించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఇది. ఈ టీవీ ఈరోజు ఫ్లికార్ట్ కార్ట్ నుంచి రూ. 18,999 ఆఫర్ ధరకు సేల్ అవుతుంది. అయితే, HDFC క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి 12 నెలల EMI ఆఫర్ తో కొనేవారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అందుకే, ఈ టీవీ ఈ ఆఫర్ తో ఈరోజు కేవలం రూ. 17,499 రూపాయలకే లభిస్తుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Jio Tele OS పై నడుస్తుంది. ఈ టీవీ 43 ఇంచ్ QLED స్క్రీన్ ను 4K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 40W బాక్స్ స్పీకర్లు మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో ARM Cortex A53 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది.