10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు ఇవే.!

Updated on 19-Jun-2023
HIGHLIGHTS

మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ తో స్మార్ట్ టీవీలు మరింత చవక ధరకే లభిస్తున్నాయి

10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు

స్పెక్స్, ఫీచర్లు మరియు బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్మార్ట్ టీవీ లను పరిశీలిద్దాం

10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల వివరాలను ఈరోజు చూడనున్నాము. వాస్తవానికి, మార్కెట్ లో చాలానే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ లు లభిస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ మరియు మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ తో స్మార్ట్ టీవీలు మరింత చవక ధరకే లభిస్తున్నాయి. అయితే, నిన్న మొన్నటి వరకూ అధిక ధరలో అమ్ముడై, ప్రస్తుతం తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీల గురించి చూడనున్నాము. స్పెక్స్, ఫీచర్లు మరియు బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్మార్ట్ టీవీ లను పరిశీలిద్దాం.

1.Coocaa (32) Frameless Series

ధర : రూ. 7,999  

కూకా యొక్క ఫ్రెమ్ లేస్ సిరీస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఇటీవలి కాలం వరకూ రూ. 12,999 ధరతో అమ్మడువ్వగా, ప్రస్తుతం రూ. 7,999 రూపాయలకే లభిస్తోంది. ఈ కూకా స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో స్మార్ట్ ఫీచర్లతో వచ్చే టీవీ గా నిలుస్తుంది. ఈ టీవీ లో డ్యూయల్ WiFi, HDMI, USB వంటి కనెక్టివిటీ మరియు Dolby Audio మరియు DTS సరౌండ్ వంటి సౌండ్ సపోర్ట్  కూడా ఉన్నాయి.

2. Kodak (32) Special Edition Series

ధర : రూ. 7,999

ప్రముఖ బ్రాండ్ కోడాక్ నుండి వచ్చిన ఈ 32 స్మార్ట్ టీవీ కూడా బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB మరియు బిల్ట్ ఇన్ Wifi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో పాటుగా 30W సౌండ్ అందించ గల స్పీకర్లు, 512MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు ఫ్రీమ్ లెస్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

3. Dyanora Sigma (32) Smart TV

ధర : రూ. 8,199

ప్రముఖ టీవీ బ్రాండ్ Dyanora యొక్క ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ A+ Grade ప్యానల్ మరియు HDR సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ లో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో పాటుగా ఇన్ బిల్ట్ వై-ఫై కూడా వుంది. ఈ టీవీ 30W సౌండ్ అందించ గల స్పీకర్లను సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో కలిగి వుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

4. iFFALCON by TCL (32) Smart TV

ధర : రూ. 7,999

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ముందుగా రూ. 12,999 రూపాయల ధరలో సేల్ అవ్వగా ప్రస్తుతం రూ. 9,999 ధరలో లభిస్తోంది. ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ మైక్రో డిమ్మింగ్, HDR 10 మరియు IPQ ఇంజిన్ వంటి ఫీచర్లతో చక్కని విజువల్స్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ లో Dolby Audio సపోర్ట్ మరియు 16W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ కూడా అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :