10 వేల ధరలో బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..!

10 వేల ధరలో బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..!
HIGHLIGHTS

కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ

Flipkart ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన మంచి ఆఫర్లను కూడా అందిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.8,099 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది

కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, Infinix 32y1 స్మార్ట్ టీవీని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ టీవీ ని లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసింది మరియు కేవలం 10 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది. అంతేకాదు, Flipkart  ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన మంచి ఆఫర్లను కూడా అందిస్తోంది. వెరసి, ఈ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో మంచి అప్షన్ గా నిలుస్తుంది. Flipkart నుండి ఈరోజు బ్యాంక్ అఫర్ తో కొనేవారికి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.8,099 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది.       

Infinix 32y1: ధర మరియు ఆఫర్లు

ఇన్ఫినిక్స్  ఈ Infinix 32y1 స్మార్ట్ టీవీ ధర కేవలం ధర రూ.8,999. ఈ స్మార్ట్ టీవీని Flipakrt నుండి ఈరోజు Kotak మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI  తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.  

Infinix 32y1: స్పెక్స్

ఇక ఈ ఇన్ఫినిక్స్ 32వై1 32-అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ HD-Ready DLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.  ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W బాక్స్ స్పీకర్ లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంటుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే,  YPbPr వీడియో అవుట్‌పుట్, 3 HDMI, 2 USB, 1 RJ-45 మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్‌ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 512MB RAM మరియు 4 GB స్టోరేజ్‌తో స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టీవీ Linux OS పైన రన్ అవుతుంది మరియు ఇన్ బిల్ట్ Wi-Fi మరియు మిరక్యాస్ట్ తో వస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo