రూ.4,999 ధరకే ఒక 32-ఇంచ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ : అదే Samy SM 32 -K5500

Updated on 08-Feb-2019
HIGHLIGHTS

GST మరియు షిప్పింగ్ ఛార్జ్ కలిపితే ధర 8,022 రూపాయలుగా ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, మనము స్మార్ట్ ఫోన్ల యొక్క ధరలలో గణనీయమైన మార్పులను చూస్తున్నాము.  ప్రధాన స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తుల యొక్క ధరలను  తగ్గించేందుకు Xiaomi మరియు OnePlus వంటివి బ్రాండ్స్ సరసమైన ధరలలో వాటి డివైజెస్ అందిస్తున్నాయి. అలాగే, షావోమి దాని స్మార్ట్ TV లను ప్రారంభించడం ద్వారా ఈ విభగంలో కూడా సంక్షోభం సృష్టించింది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ ఆధారిత కంపెనీ అయిన, SAMY INFORMATICS  తన సరసమైన స్మార్ట్ టివి కేవలం రూ. 5,000 రూపాలయ కేటగిరీ పరిధిలోకి తీసుకొచ్చింది.

Samy SM32-K5500 యొక్క ధర గురించి మాట్లాడితే, ఇది షిప్పింగ్ మరియు GST ను కలపకుండా గనుక చుస్తే, ఇది కేవలం రూ .4,999 ధర వద్ద ప్రారంభించబడింది. ఈ ధరలో 18 శాతం GST మరియు 1,800 షిప్పింగ్ ఛార్జ్ ని గనుక జతచేసి చూస్తే , ఇది 8,022 రూపాయలుగా ఉంటుంది. ఢిల్లీలో, వినియోగదారులు షిప్పింగ్ కోసం రూ .1,500 చెల్లించాల్సి ఉంటుంది, తద్వారా వారికి ఈ టీవీ 7,398 రూపాయల ధర ఉంటుంది. భారతదేశంలో తయారు చేయబడిన ఈ టీవీ 13366 × 786 పిక్సల్స్ యొక్క HD రిజల్యూషనుతో 32 అంగుళాల LED డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది 16: 9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది.

ఈ టీవీ Android OS (4.4 KitKat) తో నడుస్తుంది మరియు ఇది YouTube, Facebook మరియు అనేక ఇతర App కు అనుకూలంగా ఉంటుంది. అధనంగా, 4GB స్టోరేజ్ మరియు 512MB RAM కలిగి ఉంది.

TV ఖర్చు ధర కేవలం రూ 4,999 గా వున్నా కూడా, వినియోగదారులు నాటకీయంగా, అన్ని కలగలుపుకుని, చివరికి ఇది రూ 8,022 ధరతో మార్కెట్ లో అమ్మకాలను కొనసాగించాల్సి ఉంటుంది . అయితే, ఈ ధర ఒక Android స్మార్ట్ TV కొనుగోలుసు చేయడానికి కచ్చితంగా ఎక్కువ రేటు మాత్రం కాదు. మీరు ఈ స్మార్ట్ TV ను కేవలం Samy App ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు, ఇది Android ప్లాట్ఫారమ్ లో  అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన  అంశమేమిటంటే, వినియోగదారులు వారి మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబరుతో కలిపి లింక్ చేయాలి.

సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే,  ప్రైవేట్ కంపెనీలు ఆధార్ లింక్ గురించి ఎటువంటి ఒత్తిడి చెయ్యకూడదు, కానీ ఎందుకు సామి TV కోసం ఆధార్ లింక్ అడుగుతున్నదనే ప్రశ్న తలెత్తింది. దీనితో పాటుగా, సేల్ చేసిన ఆరువాత సర్వీస్ సెంటర్స్ ఎంతవరకూ అందుబాటులో ఉన్నాయో అనేవిషయం కూడా  స్పష్టంగా లేదు.

గమనిక: పైన చూపిన చిత్రం కల్పితమైనది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :