Amazon Upcoming Sale గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ మొదలయ్యే డేట్ తో పాటు ఈ సేల్ నుంచి అందించబోతున్న బెస్ట్ డీల్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. అమెజాన్ ఈ సెల్ కోసం అందించినటువంటి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ ద్వారా అప్ కమింగ్ డీల్స్ ను టీజ్ చేస్తోంది. ఈ టీజింగ్ పేజి ద్వారా అమెజాన్ అప్ కమింగ్ సేల్ స్మార్ట్ డీల్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.
అమెజాన్ రిపబ్లిక్ డేస్ సేల్ నుంచి స్మార్ట్ టీవీల పై గొప్ప డీల్స్ అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న టాప్ డీల్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేయడం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అమెజాన్ ఆఫర్ చేయబోతున్నట్లు చెబుతున్న డీల్స్ ను కూడా ఇప్పుడు బయట పెట్టింది.
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి అందించనున్న రెండు స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇప్పటికే అమెజాన్ రివీల్ చేసింది. అలాగే, సేల్ వరకు రోజుకు ఒక డీల్ ను రివీల్ చేస్తుందని కూడా తెలిపింది. ఇక అమెజాన్ ఇప్పటికే వెల్లడించిన డీల్స్ విషయానికి వస్తే , అమెజాన్ సేల్ నుంచి Vu యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ Vibe సిరీస్ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ప్రకటించింది. అమెజాన్ సేల్ నుంచి ఈ టీవీని అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ టీవీని రూ. 36,490 రూపాయల ధరకు అందుకోవచ్చని తెలిపింది.
Also Read: Amazon Echo Spot: కలర్ స్క్రీన్ మరియు డీప్ బాస్ సౌండ్ సపోర్ట్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
ఇక రెండవ స్మార్ట్ టీవీ డీల్ వివరాల్లోకి వెళితే, Hisense లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ E6N 43 ఇంచ్ స్మార్ట్ టీవీని అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 21,999 ధరకు పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ రెండు టీవీ లు కూడా అమెజాన్ ఇండియా యూజర్స్ నుంచి 4 ప్లస్ రేటింగ్ అందుకున్న బెస్ట్ టీవీలు గా కూడా అమెజాన్ చెబుతోంది. త్వరలో Xiaomi, LG, Sony మరియు Samsung స్మార్ట్ టీవీ ల అందించనున్న డీల్స్ ను అనౌన్స్ చేస్తుందట.