అమెజాన్ ఇండియా ఈరోజు వన్ ప్లస్ Tv Y సిరీస్ నుండి వచ్చిన Y1 పైన భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్లతో కేవలం బడ్జెట్ ధరలోనే అమెజాన్ నుండి ఈరోజు లభిస్తోంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు స్మార్ట్ ఫీచర్లను కలిగివుంది. OnePlus Android TV 32Y1 స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్లను అందించింది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ ధర మరియు టీవీ వివరాలను క్రింద చూడవచ్చు.
అమెజాన్ ఈరోజు Oneplus TV Y1 (32) HD రెడీ స్మార్ట్ టీవీని రూ.15,999 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. అయితే,ఈ స్మార్ట్ టీవీని కొనేవారికి 1,000 డిస్కౌంట్ కూపన్ ను కూడా అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీని Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారు 1,500 రూపాయల ఫ్లాట్ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy Form Here
ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1 2020 లో మార్కెట్లో ప్రవేశపెట్టబడింది మరియు ఇది 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ DCI-P3 93 కలర్ గాముత్ మరియు డైనమిక్ కాంట్రాస్ట్ ను కలిగివుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Android 9.0 OS పైన నడుస్తుంది. ఈ టీవీ Gamma Engine తో మంచి పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీ 2HMDI మరియు 2 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.