అమెజాన్ ఇండియా ఈరోజు TCL QLED Smart Tv ల పైన గొప్ప భారీగా ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ టీసీఎల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన క్యూలెడ్ ప్రో సిరీస్ C16B సిరీస్ స్మార్ట్ టీవీల పైన ఈ ఆఫర్లను అందించింది. అమెజాన్ ఈ టీసీఎల్ టీవీల పై డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందించింది. అందుకే, ఈరోజు ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
టీసీఎల్ క్యూలెడ్ ప్రో స్మార్ట్ టీవీ సిరీస్ నుంచి వచ్చిన 55 ఇంచ్, 50 ఇంచ్ మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీల పై ఈ అమెజాన్ ఈ ఆఫర్లను అందించింది. ఈ సిరీస్ నుండి వచ్చిన ఈ మూడు టీవీలు ఈరోజు డిస్కౌంట్ లభిస్తున్నాయి.
టీసీఎల్ 55 ఇంచ్ క్యూలెడ్ టీవీ మోడల్ నెంబర్ (55C61B) ఈ రోజు 62% డిస్కౌంట్ తో రూ. 45,990 ధరకే ‘లిస్ట్ చెయ్యబడింది. ఈ టీవీ పైన రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బాంక్స్ కార్డ్స్ EMI ఆప్షన్ తో గరిష్టంగా రూ. 2,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. అంటే, ఈ టీవీ పైన తెలిపిన ఆఫర్లతో రూ. 39,990 రూపాయలకే అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది. Buy From Here
టీసీఎల్ 50 ఇంచ్ క్యూలెడ్ టీవీ మోడల్ నెంబర్ (50C61B) ఈ రోజు 67% డిస్కౌంట్ తో రూ. 37,990 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన కూడా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బాంక్స్ కార్డ్స్ EMI ఆప్షన్ తో గరిష్టంగా రూ. 2,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ టీవీ ఈరోజు ఈ ఆఫర్లతో రూ. 34,990 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. Buy From Here
ఇదే విధంగా 43 ఇంచ్ టీవీ ఈ రోజు 46% డిస్కౌంట్ తో రూ. 32,990 రూపాయలకు సేల్ అవుతోంది. అదనంగా, ఈ టీవీ పైన రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు HDFC బాంక్స్ కార్డ్స్ EMI ఆప్షన్ తో రూ. 2,000 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ టీవీని రూ. 28,990 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: iPhone 15 పై Flipkart జబర్దస్త్ అఫర్: 15 వేల డిస్కౌంట్ తో ఐఫోన్ 15 అందుకోండి.!
ఇక ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 4K Ultra HD (3840 x 2160) స్క్రీన్ తో వస్తుంది. 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ టీవీలు 60Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటే, 55 ఇంచ్ టీవీ మాత్రం 120Hz VRR (వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ మూడు టీవీలు కూడా HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తాయి.
ఈ టీవీ లలో సౌండ్ సపోర్ట్ లో కూడా మార్పులు ఉంటాయి. 55 ఇంచ్ మరియు 50 ఇంచ్ టీవీ లో సబ్ ఉఫర్ మరియు ONKYO 2.1 సౌండ్ సెటప్ మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది. 43 ఇంచ్ టీవీ మాత్రం 30W సూడఁ అవుట్ పుట్ మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది.