అమెజాన్ బెస్ట్ టీవీ డీల్: రూ.28,999 ధరకే Dolby Vision & Atmos స్మార్ట్ టీవీ

Updated on 29-Dec-2021
HIGHLIGHTS

Hisense ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

ఈ టీవీ Dolby Vision HDR తో అద్భుతమైన పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది

క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది

చవక ధరకే బ్రాండెడ్ పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ అదికూడా Dolby Vision & Atmos లకు సపోర్ట్ చేసే స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే, Amazon ఈరోజు Hisense ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని 36% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ టీవీని అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్, ఎక్స్ చేంజ్ అఫర్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here

Hisense (43 inch) Ultra HD (4K): స్పెక్స్

ఈ Hisense 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ పరంగా, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది.  ఈ టీవీ Dolby Vision HDR తో అద్భుతమైన పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ 5G Wi-Fi (Dual బ్యాండ్)  కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ  సపోర్ట్ కలిగిన 24W పవర్ ఫుల్ సౌండ్ అందించగల  స్పీకర్ల శక్తితో ఉంటుంది. తద్వారా అద్భుతమైన సౌండ్ మీకు అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :