Vu GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ ఆఫర్లు అందుకోండి.!

Vu GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ ఆఫర్లు అందుకోండి.!
HIGHLIGHTS

లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై అమెజాన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

Vu GloQLED సిరీస్ స్మార్ట్ టీవీ ల పై బెస్ట్ డీల్స్ అందించింది

AI పిక్చర్ స్మార్ట్ సీన్ అప్ స్కేల్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది

Vu GloQLED సిరీస్ నుంచి అందించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై అమెజాన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది మరియు మంచి ఫీచర్స్ తో యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి గరిష్టంగా 4.6 రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Vu యొక్క సొంత ప్రోసెసర్, మంచి విజువల్స్ అందించే A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Vu GloQLED Series 4K QLED Tv: ఆఫర్స్

ఈ Vu గ్లో క్యూలెడ్ సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవల మార్కెట్లో రూ. 36,990 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 33,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని ని Federal, HSBC మరియు DBS క్రెడిట్ కార్డు ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ . 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ 55 ఇంచ్ Vu స్మార్ట్ టీవీని కేవలం రూ. 32,490 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: Soundbar Deals: 3 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!

Vu GloQLED (55) స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ Vu స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ A+ గ్రేడ్ Glo QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ VuOn ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10, HLG డైనమిక్ బ్యాక్ లైట్, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, AI పిక్చర్ స్మార్ట్ సీన్ అప్ స్కేల్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

Vu GloQLED Series 4K QLED Tv

ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు ఇందులో ఆడియో ఓన్లీ మోడ్ కూడా ఉంటుంది. ఈ Vu స్మార్ట్ టీవీ HDMI CEC మరియు eARC/ARC, USB, 2 వే బ్లూటూత్ 5.3, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo