Xiaomi ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన Dolby Vision IQ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించడంతో పాటు మంచి సౌండ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది.
షియోమీ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ 4K డాల్బీ విజన్ iQ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L55M8-5XIN పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఇండియాలో రూ. 44,999 రూపాయల ధరతో లాంచ్ అయినా ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,600 రూపాయల డిస్కౌంట్ తో రూ. 41,399 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ల్యాబ్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 39,399 రూపాయల డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: iQOO కర్వుడ్ డిస్ప్లే ఫోన్స్ పై Big Deals: చవక ధరకే లభిస్తున్న కొత్త ఫోన్లు.!
ఈ షియోమీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ 4K డాల్బీ విజన్ IQ, HDR10+, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ప్రీమియం మెటాలిక్ బాడీ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 64-bit Quad Core A55 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ షియోమీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ALLM వంటి ఇతర ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. HDMI 2.1 x 3(eARC), 2USB, ఈథర్నెట్, AV in, ఆప్టికల్ 3.5mm తో పాటు బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.