digit zero1 awards

లేటెస్ట్ Mini QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ మరియు ఉచిత Fire Tv Stick కూడా అందుకోండి.!

లేటెస్ట్ Mini QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ మరియు ఉచిత Fire Tv Stick కూడా అందుకోండి.!
HIGHLIGHTS

Mini QLED Smart Tv కొనడానికి చూస్తుంటే ఈరోజు మంచి ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీతో ఉచిత Fire Stick ను కూడా జతగా తీసుకు వస్తుంది

మీ ఇంటికి తగిన కొత్త Mini QLED Smart Tv కొనడానికి చూస్తుంటే ఈరోజు మంచి ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు ఉచిత Fire Stick ను కూడా జతగా తీసుకు వస్తుంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

ఏమిటా Mini QLED Smart Tv ఆఫర్?

తోషిబా బ్రాండ్ యొక్క 55 ఇంచ్ అల్ట్రా హెచ్ డి మినీ ఎల్ఈడి సూపర్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55M650MP పై ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా  40% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ టీవీ ఈ రోజు రూ. 50,999 ధరకే లభిస్తోంది. అయితే, ఈ టీవీ పైన రూ. 8,000 డిస్కౌంట్ కూపన్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 42,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

అంతేకాదు, ఈ తోషిబా మినీ ఎల్ఈడి సూపర్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

ఈ అన్ని ఆఫర్లను అందుకుంటే ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 40,999 రూపాయలకు మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ టీవీతో రూ. 4,499 రూపాయల విలువైన Fire Tv Stick ని ఉచితంగా కూడా పొందవచ్చు. Buy From Here

Also Read: OnePlus Nord CE4 Lite: 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5500mAh బిగ్ బ్యాటరీ తో వస్తోంది.!      

ఈ తోషిబా Mini QLED Smart Tv ఫీచర్లు ఏమిటి?

ఈ తోషిబా మినీ ఎల్ఈడి సూపర్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 120Hz లోకల్ డిమ్మింగ్ జోన్స్ మరియు క్వాంటం డాట్ కలర్ స్క్రీన్ ను 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10,  HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన విజువల్ ను అందిస్తుంది. ఈ టీవీ లో  eARC, CEC HMDI పోర్ట్, USB పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంది.

Toshiba Mini QLED Smart Tv
Toshiba Mini QLED Smart Tv

ఇక ఈ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ లో 2.1 ఛానెల్ సౌండ్ సపోర్ట్ వుంది. ఈ టీవీ టోటల్ 49W సౌండ్ అందిస్తుంది మరియు REGZA Bass ఉఫర్ ను కూడా కలిగి వుంది. ఈ టీవీ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వుంది మరియు ఈ టీవీ VIDAA U6 OS పైన నడుస్తుంది.                       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo