Amazon Basics Fire TV : తక్కువ ధరకే అమెజాన్ సొంత టీవీలు వచ్చేశాయి

Amazon Basics Fire TV : తక్కువ ధరకే అమెజాన్ సొంత టీవీలు వచ్చేశాయి
HIGHLIGHTS

అమెజాన్ తన సొంత టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Amazon Basics బ్రాండ్ క్రింద ఈ కొత్త టీవీల లాంచ్

ఈ టీవీలు Fire tv UI లో పని చేస్తాయి మరియు Alexa In Built తో వస్తాయి.

అమెజాన్ తన  సొంత టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  Amazon Basics బ్రాండ్ క్రింద ఈ కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఈ టీవీని Amazon Basics Fire TV Edition 4K Ultra HD Smart LED TV పేరుతొ విడుదల చేసింది. ఈ టీవీ ముందుగా వచ్చిన Onida Fifre TV ఎడిషన్ టీవీలలో చూసిన Fire TV యూజర్ ఇంటర్ ఫేజ్ లో ఈ టీవీ పనిచేస్తుంది.  అమెజాన్ లేటెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ 4K స్మార్ట్ LED  టీవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ Amazon Basics Fire TV Edition 4K Ultra HD Smart LED TV ప్రస్తుతానికి కేవలం 50 మరియు 55 ఇంచ్ సైజుల్లో మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ టీవీల ధరను మాత్రం చాలా తక్కువకే అందించింది. కానీ, త్వరలోనే 43 మరియు 32 ఇంచ్ రోజుల్లో కూడా తన స్మార్ట్ టీవీలను తీసుకొస్తుందని భావిస్తున్నారు.

కొత్తగా లాంచ్ చేసిన ఈ అమెజాన్ 4K స్మార్ట్ టీవీలు HDR 10 మరియు Dolby Vision రెండింటికి సపోర్ట్ చెయ్యగల 4K టీవీలు. అంటే, మీరు చూసే కంటెంట్ పూర్తిగా మీకు Life Like అనుభూతిని అందిస్తాయి. అలాగే, 50 మరియు 55 అంగుళాల రెండు టీవీలు కూడా ఒకే విధమైన ప్రత్యేకతలతో వస్తాయి.

ఈ రెండు టీవీలు కూడా కనెక్టివిటీ పరంగా, 3 HDMI 2.0 పోర్టులను మరియు 2 USB పోర్టులను కలిగి ఉంటుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీలు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో మరియు 20W స్పీకర్లను కలిగి ఉంటాయి. పైన తెలిపినట్లుగా ఈ టీవీలు Fire tv UI లో పని చేస్తాయి మరియు Alexa In Built తో వస్తాయి.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo