సగం ధరకే లభిస్తున్న Hisense 4K Dolby Vision గూగుల్ టీవీ.!

సగం ధరకే లభిస్తున్న Hisense 4K Dolby Vision గూగుల్ టీవీ.!
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) సేల్ నుండి భారీ స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది

ఈరోజు కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే ఈ డీల్ అందుబాటులో ఉంటుంది

Hisense Delight సిరీస్ 4K Dolby Vision TV భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) సేల్ నుండి భారీ స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది. ఈరోజు కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే ఈ డీల్ అందుబాటులో ఉంటుంది. మీరు కనుక ప్రైమ్ మెంబర్ అయితే, ఈ టీవీ అఫర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ US ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Hisense లేటెస్ట్ గా ఇండియాలో ప్రకటించిన Hisense Delight సిరీస్ 4K Dolby Vision భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.23,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ టీవీ 3 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ అందించిన ఆఫర్ల వివరాలను తెలుసుకోండి.

Hisense 4K Dolby Vision పైన అమెజాన్ అందించిన ఆఫర్లు ఏమిటి?

Hisenseలేటెస్ట్ విడుదల చేసిన 43 ఇంచ్ Bezelless Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మోడల్ నంబర్ 43A6H ను అమెజాన్ MRP ధర 44,990 పైన 47% డిస్కౌంట్ అందించింది. డిస్కౌంట్ తరువాత ఈ టీవీ రూ.23,990 ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ టీవీ పైన 2000 రూపాయల ప్రైమ్ సేవింగ్స్ అడిషనల్ అఫర్ ను అందించింది. ఈ అఫర్ అన్ని బ్యాంక్ కార్డ్స్ లకు వర్తిస్తుంది. ఈ టీవీ చెక్ అవుట్ సమయంలో మీ బ్యాంక్ కార్డ్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. దీని కోసం ఎంటువంటి Promo Code కూడా అవసరం లేదు. అలాగే, SBI కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్లతో ఈ టీవీని 21,990 రుపాయల చవక ధరకే పొందేవీలుంది. Buy From Here

Hisense 4K Dolby Vision ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈ Hisense 43 ఇంచ్ Bezelless Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ హైసెన్స్ టీవీ Dolby Vision, HDR 10, HLG లు సపోర్ట్ చేస్తుంది మరియు ALLM తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంది. ఇక కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు బ్లూటూత్ v5.1 వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo