amazon announced big discount offer on Sony BRAVIA 3 Smart Tv
భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన Sony BRAVIA 3 Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో 93 వేల రూపాయల బడ్జెట్ ధరలో విడుదలైన సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు అమెజాన్ నుంచి 21 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం 73 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లో రూ. 93,990 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ టీవీ గత సంవత్సరం జూలై నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ టీవీ ఇప్పుడు అమెజాన్ అందించింది రూ. 18,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఇప్పుడు రూ. 75,990 ధరకే లభిస్తోంది.
ఇది మాత్రమే కాదు, ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ రూ. 72,990 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు తో కొనే వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కోన్ వారికి రూ. 2,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ నుంచి 70 వేల రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: బెస్ట్ డీల్స్ తో 26 వేల బడ్జెట్లోనే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv అందుకోండి.!
ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ సోనీ టీవీ 4K HDR Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ ట్రైలుమినస్ ప్రో, 4K X-రియాలిటీ ప్రో HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అత్యంత క్లియర్ మరియు అత్యద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.
ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Atmo మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ALLM/eARC, HDMI 2.1, బిల్ట్ ఇన్ మైక్, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి చాలా కనెక్టివిటీ ఫీచర్ తో వస్తుంది.