దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా కేవలం ఇళ్లకే పరిమితమైన తమ వినియోగదారులను ఉచితంగా ఎంటర్టైన్మెంట్ చేయనున్నట్లు , ఎయిర్టెల్ డిజిటల్ టివి, డిష్ టివి మరియు టాటా స్కై డిటిహెచ్ సర్వీస్ ఆపరేటర్లు భరోసా ఇస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి ప్రజలు ఎక్కువ కాలం ఇంట్లో ఉండటానికి కారణమైంది. అందువల్ల, ప్రజలు తమను తాము ఉత్సాహంగా మరియు వినోదభరితంగా ఉంచుకోవడం అవసరం అవుతుంది.
అందుకోసమే, ఎయిర్టెల్ మరియు డిష్ టివి ఒక్కొక్కటి నాలుగు ఛానెళ్లను విడుదల చేయగా, టాటా స్కై తన చందాదారులకు పది సేవా ఛానెళ్లను అందిస్తోంది. ఈ ఛానెళ్ళు అన్ని కూడా ఏప్రిల్ 14 వరకూ, అంటే ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ చివరి రోజు వరకూ ఉచితంగా లభిస్తాయి.
ఎయిర్టెల్ , డిష్ టివి మరియు టాటా స్కై అందించే అన్ని ఉచిత ప్లాట్‌ఫాం సర్వీస్ ఛానెళ్ళు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ యూజర్లు ఇప్పుడు ఈ నాలుగు సర్వీస్ ఛానెళ్లకు ఉచితంగా యాక్సెస్ కలిగి ఉన్నారు. వీటిలో ఆప్కి రసోయి, క్యూరియాసిటీ స్ట్రీమ్, సీనియర్ టీవీ మరియు లెట్స్ డాన్స్ ఉన్నాయి. ఈ ఛానెళ్లు అన్ని రకాలైన వయస్సు గల వారిని అలరించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు, ఆప్కి రసోయి సెలబ్రిటీ చెఫ్‌ల వంట వంటకాలను చేసేవారిని అలరిస్తాయి. అయితే, క్యూరియాసిటీ స్ట్రీమ్‌లో స్పేస్ , కళ, సంస్కృతి మరియు ఇటువంటి మరిన్ని అంశాల చుట్టూ తిరిగే చాలా సినిమాలు మరియు షోలు ఉన్నాయి. అదేవిధంగా, లెట్స్ డాన్స్ ఛానెల్ డాన్స్ కోరుకువారికి వర్చువల్ డ్యాన్స్ క్లాసులను చూపిస్తుంది. కాబట్టి, ఇక్కడ నుండే మీరు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు.
ఆప్కి రసోయి ఛానల్ నంబర్ 407, క్యూరియాసిటీ స్ట్రీమ్ 419, సీనియర్ టివి 323 మరియు లెట్స్ డాన్స్ 113 లో యాక్సెస్ చేయవచ్చు.
ఎయిర్టెల్ మాదిరిగానే, డిష్ టీవీ తన వినియోగదారులకు నాలుగు సేవా ఛానెళ్లను ఉచితంగా అందిస్తోంది. ఆయుష్మాన్ యాక్టివ్ ఛానల్ సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంది మరియు ఇది ఛానల్ నంబర్ 130 లో లభిస్తుంది. తరువాత, ఫిట్నెస్ యాక్టివ్ ఛానల్ (132) వర్చువల్ ఫిట్నెస్ తరగతులు మరియు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలను అందిస్తుంది. పిల్లల కోసం ఇతర రెండు ఛానెళ్ళు ఉన్నాయి. అవి, కిడ్స్ యాక్టివ్ టూన్స్ మరియు యాక్టివ్ రైమ్స్ మరియు ఇవి ఛానల్ నంబర్ 956 మరియు 957 లలో అందుబాటులో ఉన్నాయి.
టాటా స్కై తన చందాదారులకు ఇంట్లో వినోదాన్ని అందించడానికి పది సేవా ఛానెళ్లను అందిస్తోంది. కాబట్టి మీరు ఛానల్ నంబర్ 123 లో డాన్స్ స్టూడియో, 664/668 న ఫన్ లెర్న్, 127 న వంట, 110 పై ఫిట్‌నెస్, 701 న స్మార్ట్ మేనేజర్, 702 న వేద గణితం, 653 న క్లాస్‌రూమ్, 660 న క్లాస్‌రూమ్, 1160 న బ్యూటీ, జావేద్ అక్తర్ ను 150 లో చూడవచ్చు.
అదనంగా, వారి ఖాతాను రీఛార్జ్ చేయలేకపోయిన కస్టమర్ల కోసం కంపెనీకి క్రెడిట్ సౌకర్యం కూడా అఫర్ చేస్తోంది.