భారతీ ఎయిర్టెల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లానుతో 8.5 GB అధికంగా అందుకోవచ్చు

Updated on 07-Jan-2019
HIGHLIGHTS

ఈ 448 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఈ ప్లానులో ముందుకంటే మీరు మరింత డేటాను పొందవచ్చు.

భారతి ఎయిర్టెల్, తన ప్రీపెయిడ్ ప్రణాళికల్లో మార్పులు చేస్తోంది. మీనకు తెలుసు, ముందుగా ఎయిర్టెల్ భారతీయ విఫణిలో పెద్ద పేరు కలిగివుంది, భారతీయ మార్కెట్లో మంచి పేరుతొ నిలదొక్కుకొని వుంది. అయితే, కంపెనీ ఇటీవలే దాని ప్రజలు ఎక్కువగా రీచార్జి చేసుకొని ప్రణాళికలను దాని పోర్ట్ఫోలియో నుండి తొలగించింది.

ఆసక్తికరంగా, ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి  రూ. 199, రూ .448, రూ .509 లకు 1.4 GB రోజువారీ డేటాను అందిస్తోంది. ఇప్పటికే ముందువున్న ఈ రూ. 199 ధరలోని ప్రీపెయిడ్ ప్లాన్లను కంపెనీ సవరించింది. ఈ ప్లానుతో, ఇప్పుడు వినియోగదారులకి రోజువారీ 1.5 GB డేటాను అందిస్తున్నారు. ఈ ప్రణాళిక యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

ఇంకా, తన 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లానులో కూడా కొంత మార్పులు చేసిన తరువాత, సంస్థ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ .169 ధరలో ప్లానును అందుబాటులో ఉంచింది. అలాగే, సంస్థ దాని పూర్వ-చెల్లింపు ప్రణాళిక అయినటువంటి రూ. 399 మరియు రూ 448 ప్రణాళికల్లో మార్పులు చేసింది. ఈ 448 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఈ ప్లానులో ముందుకంటే మీరు మరింత డేటాను పొందవచ్చు.

ఈ ప్రణాళికలో, వినియోగదారులకి ఇప్పటివరకు 114.8GB డేటాను అందుకుంటుండగా, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లానుతో 123GB డేటాను పొందుతారు. మీరు ఈ ప్రణాళికతో ఇప్పుడు 8.2GB డేటాను అధికంగా పొందుతారు. అలాగే, రూ. 199 నాటి ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ప్రకారం, ఇప్పుడు మీకు రోజువారీ డేటా 1.5 GB డేటాని అందిస్తున్నారు. కానీ 399 రూపాయల ప్లానుతో, వినియోగదారులకి ఇప్పుడు తక్కువ డేటా ఇస్తారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :