Reliance Jio రూ.149 ప్లానుతో అధిక డేటా అందిస్తోంది
అన్ని టెలికం సంస్థల టారిఫ్ ధరలు పెరిగాయి
ప్రస్తుతం, అన్ని టెలికం సంస్థల టారిఫ్ ధరలు పెరిగాయి మరియు ఈ పెరిగిన రేట్ల కారణంగా బేసిక్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు మరింతగా తగ్గించబడ్డాయి. అయితే, ప్రధాన టెలికం సంస్థలు అయినటువంటి జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వాటి సంస్థలు అన్ని ప్రయోజాలతో ప్రకటించిన రూ.149 ప్లానులో డేటా విషయంలో మాత్రం జియో డైలీ 1GB డేటాతో మొత్తంగా పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 24 GB ల హై స్పీడ్ డేటాని అందిస్తుంది. అయితే, కాలింగ్ విషయానికి వస్తే, జియో FUP పరిమితితో కాలింగ్ నిముషాలు అఫర్ చేస్తుంటే, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ మాత్రం పూర్తి అన్లిమిటెడ్ కాలింగ్ అఫర్ చేస్తున్నాయి.
ముందుగా, రిలయన్స్ జియో యొక్క 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చుస్తే, ఇది రోజుకు 1GB డేటాతో మొత్తంగా 24GB డేటా తో వస్తుంది. ఇక కాలింగ్ లో జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం కేవలం 300 నిముషాల FUP లిమిట్ తో వస్తుంది. అలాగే, ప్రతిరోజూ 100 SMS ల పరిమితో ఉంటుంది . ఇది 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
ఇక ఈ భారతి ఎయిర్టెల్ యొక్క రూ. 149 ప్లానుతో రీఛార్జ్ విషయానికి వస్తే , పూర్తి వ్యాలిడిటీ కి గాను 2GB డేటా మాత్రమే అందుతుంది. అయితే, కాలింగ్ కోసం లోకల్ మరియు STD కాల్స్ ఎటువంటి నెట్వర్కు అయినా సరే అన్లిమిటెడ్ కాలింగ్ చెసుకోవచ్చు. అధనంగా 300 SMS లు కూడా అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వీటితో పాటుగా, Airtel Xtream App యొక్క సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.
చివరిగా వోడాఫోన్ యొక్క 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఇది పూర్తి వ్యాలిడిటీకి గాను మొత్తంగా 2GB డేటాతో వస్తుంది. అయితే, ఏ నెట్వర్కైనా సరే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందుబాటులో ఉంటాయి. అధనంగా, మొత్తం చెల్లుబాటు కాలానికి గాను 300 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. వీటితో పాటుగా, Zee5 యొక్క 999 రూపాయల విలువగల సబ్ స్క్రిప్షన్ కూడా అఫర్ చేస్తోంది.