త్వరలోనే Jio 5G టారిఫ్ రేట్లు పెరుగనున్నాయా..జియో ఏమంటోంది | New Update

Updated on 01-Nov-2023
HIGHLIGHTS

నెట్టింలో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది

5జి టారిఫ్ పెంచుతుందో లేదో క్లారిటీ ఇచ్చిన Jio

ఈ విషయం పైన జియో ఏమంటోంది

రిలయన్స్ జియో అత్యంత వేగంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5G సర్వీస్ లను అందిస్తున్న విషయం తెలిసిందే. 5G సర్వీస్ ను తీసుకువచ్చిన ఎటువంటి అధనపు రుసుము లేదా ఇతర ప్రత్యేక ప్లాన్స్ లేకుండా 4G ప్లాన్స్ ను జియో అందించింది. అయితే, రిలయన్స్ జియో 5G టారిఫ్ లను పెంచడానికి యోచిస్తున్నట్లు ఇప్పుడు నెట్టింలో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయం పైన జియో ఏమంటోంది మరియు 5జి టారిఫ్ పెంచుతుందో లేదో క్లారిటీగా తెలుసుకోండి.

Jio 5G tariff Hike

రిలయన్స్ జియో 5G సర్వీస్ మొదలై ఏడాది కావస్తోంది. అయితే, ఇప్పటి వరకూ కూడా జియో ప్లాన్స్ పైన టారిఫ్ హైక్ గురించి ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. ఇదే విషయాన్ని రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ క్లారిటీగా చెప్పారు. దేశంలో ఉన్న ప్రజలందిరికీ తగిన సర్వీస్ ను అందించాలంటే వాటి ధరలు కూడా తగిన విధంగా ఉండాలి. కాబట్టి, దీనికి కట్టుబడి ఉన్న కారణంగా జియో టారిఫ్ రేట్ లను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

Also Read : Amazon Finale Days: భారీ డిస్కౌంట్ తో రూ. 500 కే లభిస్తున్న బెస్ట్ TWS బడ్స్.!

దేశంలో ఇప్పటికే 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాతాల్లోని 7,764 సిటీలులో 5G నెట్ వర్క్ మరియు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన జియో, అతి త్వరలోనే దేశంలో నలుమూలలా ఉన్న అన్ని ప్రాంతాలకు 5G సేవలను విస్తరిస్తుందని పేర్కొంది. అలాగే, 5G నెట్ వర్క్ అందుబాటులో వున్నా అన్ని ప్రాంతల్లో ఎంచుకున్న జియో వినియోగదారులకు 5G Unlimited డేటాని కూడా అఫర్ చేస్తోంది.

ఇప్పటికే చాలా వేగంగా 5G నెట్ వర్క్ ను విస్తరించిన జియో, దేశంలోని మరిన్ని ప్రాంతాలను కూడా Jio 5G నెట్ వర్క్ పరిధిలోకి తీసుకు రావడానికి వేగంగా కృషి చేస్తోంది. అంతేకాదు, దేశంలో నలుమూలలకు 5G నెట్ వర్క ను విస్తరించడానికి రీసెంట్ గా jio space fiber ను కూడా తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలను కూడా IMC 2023 నుండి ఆవిస్కరించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :