vodafone యొక్క కొత్త Rs. 189 ప్లాన్ : రోజువారీ 2GB డేటా 56 రోజుల చెల్లుబాటు మరియు కాలింగ్ సౌలభ్యంతో

Updated on 10-Oct-2018
HIGHLIGHTS

ఈ టెలికాం కంపెనీ, తన కొత్త Rs.189 ప్రణాళికతో తన పోటీదారులకి గట్టి పోటీ తెచ్చింది టెలికామ్ రంగంలో.

వోడాఫోన్, జియో మీద ఆధిక్యం సాధించాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటె ఇటీవలే ప్రకటించిన రెండు కొత్త ప్లాన్ల ను చుస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు  కొత్త Rs.189 ధరతో దీర్ఘకాలిక ప్రణాళికలను తెచ్చింది, ఇవి ఈ ప్రణాళికలతో వచ్చే ప్రయోజనాలను చుస్తే ఖఛ్చితంగా చాల అనువైనవిగా ఉంటాయి.

Rs. 189 ప్రణాళిక

ఈ ప్రణాళికతో మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో భాగంగా, రోజువారీ 2GB డేటా (2G/3G /4G) మీకు దొరుకుతుంది మరియు దీనితో పాటుగా రోజువారీ 250 నిముషాలు లేదా వారానికి 1000 నిమిషాల కాలింగ్ ప్రయోజనం కూడా మీకు అందుతుంది. మీకు ఈ ప్లాన్ తో SMS ప్రయోజనం మాత్రం లేదు. ఈ ప్లాన్ యొక్క ఈ ప్రయోజనాలు అన్ని కూడా 56 రోజుల కాలవ్యవధితో చెల్లుబాటు అయ్యేలా వస్తాయి. అంటే దాదాపుగా రెండునెలల కాలంలో ఈ ప్రయోజనాన్ని పొందుతారు.                

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :