ప్రస్తుతం, నడుస్తున్న పోటీకి అనుగుణంగా అన్ని టెలికం సంస్థలు కూడా తమ పాత ప్లాన్లలో చాల మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు వోడాఫోన్ కూడా తన రూ .255 ప్రీపెయిడ్ ప్లాన్లో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు ఈ ప్లానుతో వినియోగదారులు మరింత ఎక్కువ డేటాను పొందుతారు. ముందుగా, వొడాఫోన్ తన రూ .255 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాను అందించేది, అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా ఇవ్వబడుతుంది, అదనంగా వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అంటే వినియోగదారులు ఈ ప్లానుతో ప్రతిరోజూ 500MB 4G / 3G డేటాను అధికంగా పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
కేవలం కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను మాత్రమే కాకుండా, వినియోగదారులకు LIVE టీవీ, చలనచిత్రాలు మరియు 10,000 కి పైగా షో లను చూడగలిగే అవకాశాన్ని అందిస్తోంది.
వోడాఫోన్ యొక్క రూ .255 ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్ యొక్క రూ .299 మరియు రిలయన్స్ జియో యొక్క 198-ప్లస్ ప్లాన్ మధ్య పోటీగా ఉంటుంది. ఎయిర్టెల్ రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది మరియు వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యొక్క ప్రయోజనాన్ని 28 రోజుల చెల్లుబాటు కోసం అందిస్తుంది.
జియో యొక్క 198 ప్లాన్‌తో, ప్రతిరోజూ 2GB డేటాను, అపరిమిత వాయిస్ కాల్‌లను మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు.