digit zero1 awards

వోడాఫోన్ యూజర్స్ కి 24GB 4G డేటా

వోడాఫోన్ యూజర్స్ కి 24GB 4G డేటా
HIGHLIGHTS

ఈ ఆఫర్ క్రింద 3 నెలలకు ప్రతి నెలా 8GB 4G డేటా ను ,యూజర్స్ పొందవచ్చు

వోడాఫోన్ యూజర్స్ కి 24GB 4G డేటా

ఎయిర్టెల్  తరువాత  వోడాఫోన్  కూడా తమ  యూజర్స్  కోసం ఒక కొత్త  ప్లాన్ ను  ప్రవేశపెట్టింది.ఈ ఆఫర్ కేవలం  పోస్ట్ పైడ్  వినియోగదారులకు మాత్రమే  అందుబాటు.ఈ ఆఫర్ క్రింద  వోడాఫోన్ తన  పోస్ట్ పైడ్  యూజర్స్  కోసం  24GB 4G ఇస్తుంది. ఈ ఆఫర్  క్రింద  3 నెలలకు  ప్రతి నెలా 8GB 4G డేటా ను ,యూజర్స్  పొందవచ్చు.
కేవలం కొన్ని రోజుల క్రితం తన వినియోగదారులకు ఎయిర్టెల్  30GB 4G డేటా ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ డేటా  వినియీగదారులకు  3 నెలల వరకు ఉంటుంది. మీకు  తెలిసినట్లుగా  jioమార్కెట్లోకి  వచ్చిన తరువాత అనేక  మార్పులు చోటు  చేసుకోవటం తో రోజు  ఎదో ఒక టెలికాం కంపెనీ  ఎదో ఒక ఆఫర్  ను విడుదల చేస్తున్నాయి. రిలయన్స్  కంపెనీ  భారతీయ  మార్కెట్లోకి  2016 సెప్టెంబర్  లో 4G సర్వీస్  లాంచ్ చేసింది. లాంచ్ చేసిన తరువాత యూజర్స్  కోసం వెల్కమ్  ఆఫర్ ద్వారాగా  డేటా , వాయిస్ కాల్స్  అని ఇలా  ఎన్నో  ఉచిత  సేవలు అందించింది.కేవలం  jio  వల్లే మిగతా  టెలికాం కంపెనీలు  దిగి వచ్చి  ప్రజలకి  ఇటువంటి ఆఫర్స్  ను ఇస్తున్నాయి. ఒక విధముగా  jio  వలన ప్రజలకు ఎంతో  మేలు జరిగిందని  చెప్పొచ్చు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo