ఇటీవలే, వొడాఫోన్ భారతదేశంలో తన వినియోగదారులకు కోసం ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ .229 ధరలో వస్తుంది. ఈ కొత్త ప్లాన్లో వినియోగదారుల అవసరాన్నిదృష్టిలో ఉంచుకొని, ఈ కంపెనీ పూర్తి ప్యాకేజీని అందించింది, ఇది డేటా, అపరిమిత కాల్స్, రోమింగ్ కాల్స్ మరియు SMS వంటి అన్ని సదుపాయాలను అందిస్తుంది.
ఈ కొత్త ప్లాన్ ప్రకారం, రోజుకు 2GB హై స్పీడ్ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. అలాగే, ఇది అన్లిమిటెడ్ వాయిస్ కాల్ తో పాటుగా, వినియోగదారులు 100 రోజువారీ SMS లను కూడా పొందుతారు. ఈ ప్రణాళిక 2G/3G/4G వంటి అన్ని నెట్ వర్కుల వారికీ ఈ డేటా వ్యాలిడిటీతో వస్తుంది . అలాగే, లోకల్ మరియు STD మరియు రోమింగ్ లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునేలా ఉంటుంది. ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ విషయానికి వస్తే, ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
టెలికాం టాక్ నివేదిక ప్రకారం, వోడాఫోన్ కంపెనీ ఈ ప్రణాళికను కొన్ని లిమిటెడ్ సర్కిళ్లలోనే ప్రవేశపెట్టింది. వీటిలో ఢిల్లీ NCR, ముంబై మరియు రాజస్థాన్ వంటివి ఉన్నాయి. అయితే, ఇది త్వరలోనే అన్ని సర్కిళ్లకు విస్తరించవచ్చని, అంచనా వేస్తున్నారు.
తన వివియోగధారు బేస్ ను పెంచేందుకు కొత్తగా, ప్రీపెయిడ్ SIM హోమ్ డెలివరీ సేవను వొడాఫోన్ పరిచయం చేసింది. అదేవిధంగా రిలయన్స్ జీయో కూడా ఈ సేవను ప్రారంభించింది. అంటే, మీరు ఎక్కడికి వెళ్లకుండానే, ఇంట్లో నుండే మీరు వొడాఫోన్ ప్రీపెయిడ్ SIM ని పొందవచ్చు. మీరు ఈ SIM కార్డును పొందాలనుకుంటే, మీరు వోడాఫోన్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. ప్రీపెయిడ్ ఆకౌంట్ విభాగంలో, సిమ్ డెలివరీ ఎంపికపై క్లిక్ చేయండంతో, ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.