టెలికామ్ మార్కెట్లో, రోజురోజుకు పెరుగుతున్న పోటీకారణంగా తన ప్రధాన పోటీదారులైన జియో మరియు భారతి ఎయిర్టెల్, వంటివాటికి గట్టిపోటి ఇవ్వడం కోసం వోడాఫోన్ సరికొత్త Rs 511 మరియు Rs 569 ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రారంభించింది. ఈ రెండు ప్రణాళికలను చూస్తుంటే పూర్తిగా ఎయిర్టెల్ యొక్క 499 మరియు 558 రూపాయల ప్రణాళికలకు పోటీగా ఈ రెండు ప్లాన్లను ప్రారంభించినట్లు అనిపిస్తుంది. అలాగే, జియో యొక్క 448 రూపాయల ప్రణాలికను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది, అయితే వోడాఫోన్ కంటే జియో తక్కువధరలో అదే ప్రయోజనాలతో వస్తుంది.
వోడాఫోన్ యొక్క కొత్త Rs 511 ప్రయోజనాలు
ఈ కొత్త Rs 511 ప్రణాళికతో, లోకల్, STD మరియు రొమింగ్తో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB-2G/3G/4G డేటా మరియు డైలీ 100 SMS వంటి ప్రయోజనాలతో పూర్తిగా 84 చెల్లుబాటుతో వస్తుంది. ఇది అధికంగా డేటా అవసరమున్నవారికి బాగాఉపయోగపడుతుంది. అయితే, రోజుకి 250 నిముషాలు లేదా వారానికి 1000 నిముషాల పరిమితితో అందిస్తుంది. jio యొక్క 448 రూపాయల ప్రణాళికతో పోలిస్తే, jio తక్కువ ధరలో ఇటువంటి అన్ని ప్రయోజనాలను, ఏవిధమైన పరిమితి లేని అపరిమిత కాలింగ్ తో పాటుగా అందిస్తుంది.
వోడాఫోన్ యొక్క కొత్త Rs 569 ప్రయోజనాలు
ఈ కొత్త Rs 569 ప్రణాళికతో, లోకల్, STD మరియు రొమింగ్తో అపరిమిత కాలింగ్, రోజువారీ 3GB-2G/3G/4G డేటా మరియు డైలీ 100 SMS వంటి ప్రయోజనాలతో పూర్తిగా 84 చెల్లుబాటుతో వస్తుంది. ఇది పూర్తిగా డేటా అవసరమున్నవారికి బాగాఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్రణాళిక కూడా పైన తెలిపినట్లు రోజుకి 250 నిముషాలు లేదా వారానికి 1000 నిముషాల పరిమితితో అందిస్తుంది. అయితే, తక్కువ రేటులో ఎయిర్టెల్ ఏవిధమైన పరిమితి లేని అపరిమిత కాలింగ్ తో పాటుగా 3GB డేటా తో పాటుగగా న్నీ ప్రయోజలని కూడా దీనివల్లనే అందిస్తోంది.