VODAFONE రూ. 39 ఆల్ రౌండర్ బంపర్ ప్లాన్
ప్రస్తుతం, అన్ని టెలికం సంస్థలు కూడా తమ వినియోగదారులను తమ నెట్వర్క్లకు అంటిపెట్టుకుని ఉండేలా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. టెలికం సేవలు ప్రతి నెలా కొనసాగించాలంటే కనీస రీఛార్జ్ చేయాల్సిన అవసరముంటుంది. అయితే, దానితో ఎక్కువ మంది ఇతర నెట్వర్కులకు మారుతున్న కారణంగా, టెలికం సంస్థలు ఈ ఆల్ రౌండర్ ప్లాన్లను తీసుకొచ్చాయి. అయితే, వోడాఫోన్ తమ వినియోగదారులకు ఎం,మరిన్ని ప్రయోజనాలను అందించడానికి ఈ కొత్త రూ.39 అల్ రౌండర్ ప్లాన్ తీసుకొచ్చినట్లు చెబుతోంది.
ఈ ప్లాన్ గురించి ముందుగా టెలికాం టాక్ నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, ఈ రూ.39 అల్ రౌండర్ ప్లానుతో ఫుల్ టాక్ టైం మరియు 100MB హై స్పీడ్ డేటా తో పాటుగా 28 రోజుల చెల్లుబాటు లభిస్తోంది. అయితే, ఈ ఫుల్ టాక్ టైం లో చిన్న మెలిక పెట్టింది. అదేమిటంటే, 30 రూపాయల టాక్ టైం మీకు పూర్తి 28 రోజుల కాలానికి వాడుకునేలా ఇవ్వగా, మిగిలిన ఎక్సట్రా 9 రూపాయల టాక్ టైం మాత్రం కేవలం 7 రోజుల వ్యవధిలో వాడుకునేలా ఇస్తుంది. అలాగే, మీరు చేసే కాలింగుకు సెకనుకు 2.5 పైసలు ఖర్చవుతుంది.
ఈ ప్లాన్ను ముందునుండే అందుబాటులో ఉన్న 35 రుపాయల ఆల్ రౌండర్ ప్లానుతో పోల్చి చూస్తే, ఈ Rs.35 ప్లాన్ కూడా 26 రూపాయల టాక్ టైం మరియు 100MB హై స్పీడ్ డేటాతో పాటుగా 28 రోజుల సర్వీస్ కాలాన్ని మీకు అందిస్తుంది. అలాగే, ఈ ప్లానులో కూడా మీరు చేసే కాలింగుకు సెకనుకు 2.5 పైసలు ఖర్చవుతుంది. అయితే, కేవలం 4 రూపాయల ఎక్కువ చెల్లిచడానికి మీరు సిద్ధపడితే, మీకు 9 రూపాయల ఎక్స్ట్రా టాక్ టైం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. కానీ, దాన్ని మాత్రం ఒక వారం గడువులోపుగా వాడుకోవాల్సివుంటుంది.